Telangana Govt: దావోస్లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు..
- దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డు..
- గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడుల రికార్డు నమోదు..
- వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ లో రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిన తెలంగాణ..
- గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Govt: దావోస్ లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డులు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడులను ఆకర్షించింది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ఇప్పటికే రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణ దక్కించుకుంది. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ.40, 232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి మూడింతలకు మించిన పెట్టుబడులు రావటం విశేషం. దావోస్ వేదికపై ఈసారి తెలంగాణ రాష్ట్రం అందరి దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారధ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్లో వివిధ పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశాలన్నీ విజయవంతమయ్యాయి.
Read Also: Amazon: అమెజాన్‌తో బిగ్ డీల్.. తెలంగాణలో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు
Also Read
- Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
- Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
- Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
- Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
ఇక, హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమివ్వటం ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకట్టుకుంది. దీంతో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్త్ ప్రణాళికలు పెట్టుబడుల వెల్లువకు దోహదపడ్డాయి. రాష్ట్ర సర్కార్ ఎంచుకున్న తెలంగాణ రైజింగ్ 2050 విజన్ గేమ్ ఛేంజర్ గా నిలిచింది. అన్ని రంగాలకు అనుకూలమైన వాతావరణం ఉన్న హైదరాబాద్ గ్రేటర్ సిటీ పెట్టుబడుల గమ్యస్థానంగా మరోసారి ప్రపంచానికి చాటి చెప్పినట్లైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ప్రపంచ పారిశ్రామిక వేత్తలను దృష్టిని ఆకర్షించింది.
Read Also: Minister Nimmala Ramanaidu: 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి.. నిర్వాసితులకు న్యాయం చేస్తాం..
అలాగే, దేశ విదేశాలకు చెందిన పేరొందిన పది ప్రముఖ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించి భారీ పెట్టుబడులను సాధించింది. దావోస్ లో వరుసగా మూడు రోజుల పాటు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు రాష్ట్రంలో దాదాపు 46 వేల మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి.
తాజావార్తలు
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
-
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
-
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..