TS SSC Hall Ticket 2025: తెలంగాణ రాష్ట్రంలోని టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్. పదవ తరగతి పరీక్షలు రాస్తున్న వారు ఈరోజు (శుక్రవారం) నుంచి వెబ్ సైట్‌లో తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Minister Sridhar Babu: మినిస్టర్ క్వార్టర్స్‌లో "NXP సెమీ కండక్టర్స్" ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమైయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కంపెనీ ప్రతినిధులను మంత్రి కోరారు.
Ponnam Prabhakar : ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో గత దశాబ్దంగా రేషన్ కార్డుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. మార్చి 1వ తేదీన లక్ష కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందజేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ఆయన వెల్లడించారు. మంగళవారం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి,…
రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 1వ తేదీన కొత్త రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. దాంతో పదేళ్ల తర్వాత పేదల కల నెరవేరబోతోంది. ఒకే రోజు లక్ష రేషన్ కార్డుల పంపిణీకి అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని…
Ramzan: తెలంగాణ ప్రభుత్వం రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ఉద్యోగులు కోసం ప్రత్యేక రాయితీని ప్రకటించింది. వారి మతపరమైన ఆచారాలను పాటించేందుకు వీలుగా రోజువారీ పని సమయాన్ని ఒక గంట తగ్గించి, ముందుగా ఇళ్లకు వెళ్లే అవకాశం కల్పించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) శాంతికుమారి తాజా ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 2 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్ట్ వర్కర్లు సహా అన్ని విభాగాల్లో…
సెక్రటేరియట్‌లో మంత్రి సీతక్కతో క్రిస్ప్ థింక్ ట్యాంక్ సంస్థ మెంబర్ సెక్రటరీ, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ ఆర్.సుబ్రమణ్యం భేటీ అయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, విద్య, వైద్య వ్యవస్థలు, మహిళా సాధికారతల బలోపేతంపై చర్చ జరిగింది. పేదరిక నిర్మూలన, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు క్రిస్ప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. క్రిస్ప్ తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. మంత్రి సీతక్క సమక్షంలో క్రిస్ప్ మెంబర్ సెక్రటరీ…
రేపటి నుంచి నాగోబా జాతర మొదలవనుంది. మంగళవారం రాత్రి నాగోబాకు మెస్రం వంశీయులు మహాపూజ చేయనున్నారు. కాగా.. కేస్లాపూర్ నాగోబా జాతర రేపు రాత్రి గంగాజలాభిషేకం, మహా పూజతో ప్రారంభమై ఫిబ్రవరి 4వ తేదీ వరకు జరుగుతుంది. ఆదిశేషుని నాగోబా జాతర దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర కావడం తెలంగాణకు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.
తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నాలుగు కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టనుంది. తెలంగాణ రైతాంగం, ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పథకాలు ప్రారంభించనున్నారు.
Telangana Govt: దావోస్ లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డులు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడులను ఆకర్షించింది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ఇప్పటికే రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణ దక్కించుకుంది.