DRDO- Telangana Govt Mou: రక్షణ శాఖతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. జేబీఎస్ నుంచి శామీర్ పేట్, ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ల కోసం కంటోన్మెంట్ భూములు ఇవ్వడానికి రక్షణ శాఖ సిద్ధమైంది.
PJR Flyover: హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు సమయం ఆదా చేయడానికి నిర్మించిన మరో ఫ్లైఓవర్ నేటి (జూన్ 28) నుంచి అందుబాటులోకి రానుంది. పీజేఆర్ ఫ్లైఓవర్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించనున్నారు.
Rythu Bharosa: తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు భూమి ఉన్న అన్నదాతలకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసింది. ఈ రోజు 1,551.89 కోట్ల రూపాయలను విడుదల అయ్యాయి.
Telangana Govt: ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆలోచనలు, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు గానూ గద్దర్ ఫౌండేషన్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఫౌండేషన్‌కు అవసరమైన నిధులు కేటాయిస్తామని గతంలో జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Bhatti Vikramarka: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముగ్గురు సీనియర్ ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈరోజు ( మే 27వ తేదీ) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో త్రిమెన్ కమిటీ అధికారుల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలను డిప్యూటీ సీఎంకు వారు వివరించారు.
Telangana Govt: తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది అని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 61.45 శాతం యాసంగి వడ్ల కొనుగోళ్లు పూర్తి అయినట్లు పేర్కొనింది. మే 12వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 43.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది అన్నారు.
Student Missing: లండన్ లో నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి మిస్సింగ్ కలకలం రేపుతుంది. ముప్కాల్ మండలం రెంజర్లకు చెందిన అనురాగ్ రెడ్డి లండన్ లో ఈ నెల 25వ తేదీన అదృశ్యం అయ్యాడు. కార్దీప్ ప్రాంతానికి స్నేహితులతో కలిసి వెళ్ళి అదృశ్యమైయ్యాడు.
తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చల అంశాన్ని లీడ్ చేయాలని చూస్తోందా..? కేంద్రం ఇప్పటికే ఏరివేతలో బిజీగా ఉంటే... కాంగ్రెస్ ఇప్పుడు చర్చల మాట ఎందుకు మాట్లాడుతోంది? టార్గెట్ పెట్టి మరీ... కేంద్ర బలగాలు మావోయిస్టులను ఏరిపారేస్తున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వ మాటలు చెవికెక్కుతాయా? కేంద్రం తగ్గుతుందా..? గత అనుభవం అధిష్ఠానం పరిశీలనలో ఉందా..
తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వానించాం.. దావోస్ నుంచి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చాం.. మహిళలను కోటీశ్వరులను చేయడమే మా అజెండాగా పెట్టుకున్నాం.. మహిళా పారిశ్రామిక వేత్తలను బడా పారిశ్రామిక వేత్తలుగా చేయాలని ఆలోచనతో ముందుకెళ్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. తెలంగాణలో ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటర్ పలితాలు విడుదల చేస్తారని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొననున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల…