టీఎస్పీఎస్సీ (Telangana State Public Service Commission) గ్రూప్-2 ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వివరాలు వెల్లడించారు.
ఆరోగ్యశాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఒకేరోజు మూడు వేర్వేరు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడానికి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సిద్ధమైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్, స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి..
TGPSC : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. టీఎస్‌పీఎస్సీ (TSPSC) వరుసగా ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో, మార్చి 19న ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) ఉద్యోగ రాత పరీక్షల తుది ఫలితాలు ప్రకటించింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఆధికారిక వెబ్‌సైట్ (www.tspsc.gov.in) ద్వారా చూడవచ్చు. మెరిట్ లిస్ట్ చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ అందుబాటులో ఉంది. అలాగే, ధ్రువపత్రాల పరిశీలన కోసం 1:2 నిష్పత్తిలో…
TGPSC : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా గ్రూప్-1 మెయిన్స్ (Group-1 Mains) పరీక్షలు గత ఏడాది అక్టోబర్ 21 నుండి 27 వరకు నిర్వహించగా, మొత్తం 21,093 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 31,383 మంది అభ్యర్థుల్లో…
TS Group-1: తెలంగాణలో గ్రూప్ 1 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక జారీ చేశారు అధికారులు. గ్రూప్-1 దరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దుకునేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) అవకాశం కల్పించింది.
తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కంకణం కట్టుకున్న తెలంగాణ సర్కార్ తాజాగా మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. టీఎస్ ఎన్పీడీసీఎల్ పరిధిలో 82 అసిస్టెంట్ ఇంజనీర్లు(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే.. జూన్ 27 నుండి దరఖాస్తుల స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూలై 11 కాగా.. ఆగస్ట్ 14న ఉదయం 10.30 నుండి…
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ త్వరలోనే తెలంగాణలో ఖాళీగా ఉన్న 91 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ మధ్యనే ఆర్థిక శాఖ మొదటి విడుత క్రింద 30,543 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఉద్యోగార్థులకు తీపికబురు చెబుతూ.. పలు సూచనలు చేసింది. అవేంటంటే.. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు.. దీనికోసం వెంటనే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోండి అని టీఎస్పీఎస్సీ వెల్లడించింది.…