రాష్ట్రంలో బీజేపీ-TRS వార్ జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ వరంగల్ పర్యటన ఆసక్తి రేపుతోంది. ఎన్నో పోరాటాలకు పురుడుపోసిన కాకతీయ యూనివర్సిటీలో గవర్నర్ పర్యటన హై టెన్షన్ సృష్టిస్తోంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై వరంగల్‌లో పర్యటించనున్నారు. అక్కడ కాకతీయ యూనివర్సిటీలో జరిగే 22వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు.. 2019-2020 సంవత్సరంలో వివిధ కోర్స్ లలో పీ.హెచ్.డీ పూర్తి చేసుకున్న 56 మందికి డాక్టరేట్ పట్టాలు ప్రదానం చేయడంతో పాటు 276 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం…
సింహాచలం అప్పన్న చందనోత్సవం కనుల పండువగా సాగుతోంది. చందనోత్సవానికి లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఈ చందనోత్సవానికి హాజరయ్యారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర. లక్ష్మీనర్సింహ స్వామి నిజ రూపాన్ని దర్శించుకున్న స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర. ఏపీలో గొప్ప నారసింహక్షేత్రం సింహాచలం అన్నారు స్వరూపానందేంద్ర. సింహాద్రి అప్పన్నకు నిర్వహించే వేడుక చందనోత్సవం. వరాహ లక్ష్మీ నర్సింహ స్వామి దర్శనం సంతోషాన్నిచ్చిందన్నారు స్వరూపానందేంద్ర. తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకున్నానన్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా చందనోత్సవానికి భక్తులను అనుమతించలేదన్నారు స్వరూపానందేంద్ర.…
విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్న ఆలయం భక్తజన సంద్రంగా మారింది. సింహాచలం ఆలయంలో స్వామివారి చందనోత్సవంలో పాల్గొన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు తమిళిసై. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం లభించడం మహాభాగ్యం అన్నారు తమిళిసై. తొలిసారి చందనోత్సవంలో పాల్గొన్నాను. ఇక్కడ వరాహ లక్ష్మీనరసింహస్వామి పవర్ ఫుల్ గాడ్, ఆలయంలో అడుగు పెడితేనే వైబ్రేషన్స్ ఉన్నాయ్ అన్నారు తెలంగాణ గవర్నర్ తమిళసై.కొండపై స్వామివారి చందనోత్సవంకు క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతోంది. సాయంత్రం వరకు…
వైద్య వృత్తి కష్టమైనా డిప్రెషన్ కి గురికావద్దని వైద్యవిద్యార్ధులకు సూచించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. బీబీనగర్ ఎయిమ్స్ లో 2021 – 2022 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థులకు వైట్ కోట్ సెరిమోనీ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వైద్యవిద్యార్ధులకు హితోపదేశం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా అన్నారు గవర్నర్. ఆయుష్‌మాన్ భారత్, జన ఔషధి పథకాలను సద్వినియోగం పరుచుకోవాలన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ తెలంగాణ గౌరవ చిహ్నం అన్నారు.…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ వనిత టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా సెల్వమణి ముచ్చటించారు. ఇది వనిత టీవీకి ప్రత్యేకం. ఓ సాధారణ మహిళ మంచి డాక్టర్ అవుతుంది. ఓ సాధారణ మహిళ గవర్నర్ గా మారి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మహిళలు అన్ని రకాల బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. తన తల్లి తనకు స్ఫూర్తి…
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. సమ్మక్క-సారక్క అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో విచ్చేస్తున్నారు. అయితే ఈ నెల 16న ప్రారంభమైన మేడారం జాతర నేటితో ముగియనుంది. నేడు అమ్మవార్లు వనప్రవేశంతో మేడారం జాతర తుదిదశకు చేరుకోనుంది. అయితే అమ్మవార్లను ఇప్పటికే రాజకీయ ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అయితే తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళసై కూడా నేడు సమక్క-సారక్క…
ఇటీవల జరిగిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా టిఎఫ్‌సిసి ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ తో పాటు, తెలంగాణ ‘మా’ ప్రెసిడెంట్ రష్మి ఠాకూర్, టిఎఫ్‌సిసి వైస్ ఛైర్మన్ నెహ్రు, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు తదితరులు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను వారి కార్యాలయంలో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. పదివేల మంది సభ్యులున్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినందుకు,…
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ తాను భారతీయురాలిగా గర్వపడుతున్నాను అని తెలిపారు. 100 కోట్లా టీకా డోస్ లు పంపిణీ మార్క్ ని చేరడం సంతోషంగా ఉంది. ఈ విజయం వైద్యులు, మెడికల్ ప్రొఫెషనల్స్ ది, ఈ సందర్భంగా ప్రధాని మోదికి కృతజ్ఞతలు. ఈ విజయంతో అనేక దేశాలు మన వైపు చూస్తున్నాయి. భారత్ లాంటి జనభా ఎక్కువగా వున్న దేశాలు ఇలాంటి విజయం సాధించడం నిజంగా అంత సులభం కాదు. స్వదేశంలో తయారైన వ్యాక్సిన్…