తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. సమ్మక్క-సారక్క అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో విచ్చేస్తున్నారు. అయితే ఈ నెల 16న ప్రారంభమైన మేడారం జాతర నేటితో ముగియనుంది. నేడు అమ్మవార్లు వనప్రవేశంతో మేడారం జాతర తుదిదశకు చేరుకోనుంది. అయితే అమ్మవార్లను ఇప్పటికే రాజకీయ ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
అయితే తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళసై కూడా నేడు సమక్క-సారక్క అమ్మవార్లను దర్శించుకోనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆమె హెలికాప్టర్‌లో మేడారంకు వెళ్లనునున్నారు. అమ్మవార్లను దర్శించుకొని బంగారం (బెల్లం) సమర్పించనున్నారు. అయితే నేడు అమ్మవార్ల వనప్రవేశంతో మేడారం జాతర ముగియనుంది. దీంతో భక్తులు భారీ అమ్మవార్ల గద్దెల వద్ద బారులు తీరి దర్శనం చేసుకుంటున్నారు. మరో రెండు సంవత్సరాలకు మళ్లీ మేడారం జాతర జరుగనుంది.