తెలంగాణ గవర్నర్ తమిళిసైని కాంగ్రెస్ నేతల బృందం కలిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ.. గవర్నర్‌కు లేఖ అందజేశారు. సోమవారం శాసనసభాపక్ష సమావేశం అనంతరం సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని నేతలు చెప్పారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా ముఖ్య నేతలు మాణిక్‌రావ్ ఠాక్రే, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్లు రవి తదితరులు ఉన్నారు. సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ…
కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించే దిశగా పయనిస్తుండటంతో ఆయన రాజీనామా చేయడానికి రాజ్ భవన్‌కు వెళతారని సమాచారం.
Tamilisai: నా మీద రాళ్ళు విసిరితే.. వాటితో భవంతులు కడతా.. దాడి చేసి రక్తం చూస్తే...ఆ రక్తంను సిరగా మార్చి నా చరిత్ర రాస్తా అని గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పెండింగ్ బిల్లులపై గవర్నర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికి వ్యతిరేఖం కాదు అని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లులను వెనక్కి పంపడంపై నా అభ్యంతరాలను క్లియర్ గా తెలిపాను అన్నారు.
Tamilisai Soundararajan: శారీరకంగా, మానసికంగా ధృడమైన పిల్లలు పుట్టేందుకు గర్భిణులు ‘సుందర కాండ’ పఠించాలని, ‘రామాయణం’ వంటి పురాణాలు చదవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆదివారం అన్నారు. స్వతగా వైద్యురాలు అయిన తమిళసై ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ నిర్వహిస్తున్న ‘గర్భ సంస్కార్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సంవర్థినీ న్యాస్ ‘ గర్భ సంస్కార్’ కార్యక్రమం కింద వైద్యులు ‘శాస్త్రీయ, సాంప్రదాయ’ మందుల మిశ్రమాన్ని తల్లులకు అందిస్తారు.
Governor Tamilisai: అమరవీరులను స్మరిస్తూ బావోద్వేగంతో గవర్నర్ తమిళి సై ప్రసంగించారు. మొత్తం ప్రసంగాన్ని తెలుగులోనే గవర్నర్ మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్ అభివృద్ధి మాత్రమే కాదన్నారు తెలంగాణ గవర్నర్ తమిళి సై.
BJP Corporators: రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తో జీహెచ్ఎంసి బీజేపీ కార్పొరేటర్ల సమావేశమయ్యారు. జల మండలి, జీహెచ్ఎంసి అధికారులపై గవర్నర్ కు కార్పొరేటర్ల ఫిర్యాదు చేశారు.
పెండింగ్ బిల్లులను ఆమోదించేలా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది.
తెలంగాణలో పెండింగ్ బిల్లుల విషయంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్ర సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.