Off The Record: కాళేశ్వరం కేసును సీబీఐ టేకప్ చేయదా? సర్కార్ కొత్త ప్లాన్
- కాళేశ్వరం కేసులో ముగ్గురు అధికారుల పాత్రపై ఏసీబీ దర్యాప్తు..
- మొత్తం 33మందికి సంబంధించిన నివేదిక..
- ఓవైపు సీబీఐకి అప్పగించి మళ్ళీ ఏసీబీ దూకుడు ఎందుకు?..
- అవినీతిలో ఆ 33మంది పాత్ర ఉన్నట్టు తేల్చిన విజిలెన్స్..
- ముగ్గురు అధికారుల ఆస్తులు వెయ్యి కోట్లకు పైనే..
- 33మందిపై విచారణ కోసం ప్రభుత్వానికి ఏసీబీ లేఖ..
- సీబీఐకి లేఖ రాసినా ఇప్పటిదాకా నో రియాక్షన్..
- సీబీఐ టేకప్ చేస్తుందో లేదోనన్న డౌట్స్ ఉన్నాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు దర్యాప్తులో ఏం జరుగుతోంది? ఓవైపు కేసును సీబీఐకి అప్పగిస్తూనే…మరోవైపు ఏసీబీ దూకుడు పెంచడాన్ని ఎలా చూడాలి? కేసును సీబీఐ టేకప్ చేస్తుందా లేదా అన్న డౌట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయా? అందుకే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఎక్స్‌ట్రా ఎంతమంది అధికారులకు సంబంధించిన సమాచారం కొత్తగా వచ్చింది?
Read Also: Pakistan Foreign Loans: ప్రపంచ దేశాలకు వంగి వంగి దండాలు పెడుతున్న పాక్.. దాని కోసమేనా?
Also Read
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. మరోవైపు ఏసీబీలో ముగ్గురు అధికారుల అవినీతిపై విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో స్టేట్ విజిలెన్స్ ఒక నివేదికను ఏసీబీకి పంపింది. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 33 మంది అక్రమార్కులు ఉన్నారని, వాళ్ళ మీద కూడా దర్యాప్తు జరపాలని కోరింది. ఆ మేరకు విచారణకు అనుమతించాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది ఏసీబీ. అయితే ఇక్కడే ఒక ప్రాధమికమైన ప్రశ్న వస్తోంది అందరికీ. ఓవైపు సీబీఐ దర్యాప్తు కోరుతూనే.. మరోవైపు ఏసీబీ విచారణలో దూకుడు పెంచడం ఏంటన్నది బిగ్ క్వశ్చన్. ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డ అధికారుల మీద చర్యలకు రంగం సిద్ధమైందని అంటున్నారు. ఇప్పటికే 33 మంది అధికారులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏసీబీకి ఇచ్చింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. అవినీతిలో వాళ్ళ పాత్ర ఉన్నట్లు నిగ్గు తేల్చింది. మరోవైపు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ముగ్గురు కీలక అధికారుల మీద కేసులు బుక్ అయ్యాయి.
Read Also: Dangerous Stunts on Road: ఇవే తగ్గించుకుంటే మంచిది.. స్కూటీపై స్టంట్స్ చేస్తూ యువకుడి రచ్చ రచ్చ
అయితే, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతోంది. ఆ ముగ్గురి ఆస్తులు కలిపి దాదాపు వెయ్యి కోట్లకుపైనే ఉంటాయని తేల్చారు అధికారులు. ఈ క్రమంలోనే… ఇటీవల విజిలెన్స్ కమిషన్ తన నివేదికను ఏసీబీకి పంపించింది. అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోమని కోరింది. అయితే డైరెక్ట్‌గా ఒక డిపార్ట్‌మెంట్ సిఫారసు చేస్తే.. ఏసీబీ కేసులు నమోదు చేయరు. అందుకే ఏసీబీ నేరుగా ప్రభుత్వానికి లేఖ రాసిందట. విజిలెన్స్ శాఖ నుంచి నివేదిక వచ్చిందని, అందులో 33 అధికారుల అక్రమాలకు సంబంధించిన సమాచారం ఉందని, వాళ్ళని విచారించేందుకు అనుమతించాలని కోరింది.
Read Also: Tilak Verma: రేవంత్‌రెడ్డిని కలిసిన తిలక్ వర్మ.. సీఎంకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన తిలక్..
ఇక, ప్రభుత్వం ఈ ఫైల్‌ని పరిశీలించి తదుపరి చర్యలకు ఆదేశించే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఏసీబీ దూకుడు పెంచి విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. అటు సీబీఐ నుంచి ఇంకా సమాచారం రావాల్సిఉంది. ప్రభుత్వం లేఖ రాసినా.. ఇప్పటిదాకా అట్ముంచి నో రియాక్షన్. అందులో కూడా రాజకీయ నాయకులతో పాటు అధికారుల అక్రమాల చిట్టా ఉందట. అయితే ఒకవైపు కేంద్ర హోం శాఖ దగ్గర ఫైల్ పెండింగ్‌లో ఉండగానే…ఏసీబీ దూకుడు పెంచడంలో అర్థం ఏంటన్నది బిగ్ క్వశ్చన్. ఇన్ని రోజుల నుంచి రియాక్షన్ లేకపోవడంతో… ఒకవేళ సీబీఐ కేసు టేకప్ చేయకపోతే ఎలాగన్న డౌట్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందా అన్న చర్చ మొదలైంది. ఎటుపోయి ఎటొచ్చినా దర్యాప్తులో తేడా పడకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటోందా అన్న సందేహాలు వస్తున్నాయట తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో.
తాజావార్తలు
-
Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
-
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
-
Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
-
Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
-
Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!