రాష్ట్రవ్యాప్తంగా 87 వేల మంది ఎన్యూమరేటర్లతో ఈ సర్వే కొనసాగుతోందని, సర్వే ప్రక్రియ వల్ల సంక్షేమ పథకాలకు ఎలాంటి కోత పడదని మంత్రి పొన్నం ప్రభాకార్ స్పష్టం చేశారు.
కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్లో స్వాగతం పలికిన జిల్లా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గత ఏడాది సరిగ్గా ఇదే రోజు కామారెడ్డి సభలో బి సి డిక్లరేషన్ ప్రకటించి ఏడాది పూర్తయిందని, బీసీ డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయి ఒక్కటైనా హామీ చేసిందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన అన్నారు.
KP Vivekananda : తెలంగాణ బీ.ఆర్.ఎస్. పార్టీకి కేసుల గురించి ఎటువంటి భయం లేదని, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కార్పొరేషన్ మాజీ చైర్మన్లైన ఎర్రోళ్ల శ్రీనివాస్, మేడె రాజీవ్ సాగర్తో కలిసి మీడియా ముందుకు వచ్చిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు రోజురోజుకు దిగజారిపోతున్నదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు దోచుకుని కాంగ్రెస్ కేంద్రం లకు పంపిస్తున్నారని, రాష్ట్రాన్ని బంగారు బాతుల్లా ఉపయోగించుకుంటున్నారని అన్నారు. Indian Railways: భార్యాభర్తల…
Kishan Reddy : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అధికారులు కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దిశా కమిటీ సమావేశం అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మైనారిటీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టళ్లు మంజూరు చేస్తే అనేక రాష్ట్రాల్లో సరైన రీతిలో అమలు కావడం లేదని, అంగన్ వాడీ స్కూళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల నిర్మాణానికి భూమి కొరత నెలకొందన్నారు కిషన్ రెడ్డి. నగరంలో…
సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర చేపట్టారు. సంగెం-భీమలింగం-ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు సాగిన పాదయాత్ర కొనసాగింది. మూసీలో నీటి కాలుష్యాన్ని పరిశీలించిన రేవంత్ రెడ్డి.. భీమలింగంకు పూజలు చేశారు. రైతులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు.
Keshavapuram Reservoir: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి ఫేజ్ 2లో భాగంగా హైదరాబాద్ శివార్లలో గత ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ పనులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.
తెలంగాణ రాష్ట్రం ఈ ఏడాది వరి దిగుబడిలో కొత్త రికార్డులను సృష్టించబోతుందని, 150 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడికి అవకాశం ఉన్నట్లు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడిని చూడబోతున్నామని, అందులో 91 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసే అవకాశముందని చెప్పారు.
CM Revanth Reddy : కులగణనపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. బోయిన్పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో కులగణన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కులగణన సంప్రదింపుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి కుల గణన సర్వే ప్రభుత్వం బాధ్యతగా భావించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పౌరసమాజం నుంచి సూచనలు తీసుకోవడానికి…
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ నగర అభివృద్ధి కోసం కీలక ప్రకటన చేశారు. "విజన్-2025" పేరుతో మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా, వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
హైడ్రా అనే పేరుతో రేవంత్ రెడ్డి సర్కారు కేవలం బ్లాక్ మెయిల్ దందా చేసే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విధానాల వల్ల భూములు అమ్మడంలో జాప్యం అవుతూ రియల్టర్లు, బిల్డర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ తెలిపారు.