CM Revanth Reddy: నేడు హైదరాబాద్ ల్బీ స్టేడియంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ముంబై నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం. ఇక మధ్యాహ్నం 3 గంటలకు SCERT కార్యాలయ ప్రాంగణంలో చిన్నారుల మాక్ అసెంబ్లీలో రేవంత్ పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరై మాట్లాడనున్నారు. కాగా.. నిన్న నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి బాలబాలికలు అందరికీ హార్ధిక శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసిందే..
Read also: Peddapalli: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్..
నేటి బాలబాలికలే భావి భారత పౌరులని విశ్వసించి ప్రజా ప్రభుత్వం పాఠశాల విద్యా రంగంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేయరాదన్న చిత్తశుద్ధితోనే ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ప్రతి ఏటా రెండు యూనిఫామ్స్ అందించాలని, ఆ బాధ్యతను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించడం జరిగింది. అలాగే పాఠశాలలకు ఉచిత విద్యుత్తు అందించే నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. భావి భారత పౌరులను తయారు చేయడంలో భాగంగానే విద్యా రంగంలో సమూల మార్పులు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యా సంస్కరణల్లో భాగంగా నిపుణులతో కూడిన విద్యా కమిషన్ ఏర్పాటు, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, కొత్త నియామకాలు అన్నీ నేటి పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలన్న సంకల్పంలో భాగంగా చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ఏకీకృత గురుకుల పాఠశాలలకు శ్రీకారం చుట్టినట్టు పేర్కొన్నారు.
Eye Operation: ఎడమ కంటిలో సమస్య ఉంటే కుడి కంటికి ఆపరేషన్ చేసిన వైద్యులు.. చివరకి?