Diljit Dosanjh : హైదరాబాదులో దిల్జిత్ కాన్సర్ట్.. తెలంగాణ సర్కార్ షాక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్ దోశాంజ్ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఆయన లైవ్ షోలు, వాటికి సంబంధించి జరుగుతున్న వివాదాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. నవంబర్ 15న హైదరాబాద్‌లో దిల్జిత్ కాన్సర్ట్ జరగనుంది. ఈ మేరకు ఈవెంట్ నిర్వాహకులకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు పంపింది. నోటీసుల ప్రకారం పిల్లలను వేదికపైకి తీసుకెళ్లకూడదని కోరారు. WHO మార్గదర్శకాల ప్రకారం లైవ్ షో సమయంలో లౌడ్ మ్యూజిక్ ఉంటుంది, ఫ్లాష్ లైట్లు ఉంటాయి కాబట్టి వారిని స్టేజ్ ఎక్కించవద్దని కోరారు. అలాగే మద్యం, మాదక ద్రవ్యాలు, హింసను ప్రోత్సహించేటువంటి పాటలను వేదికపై పాడకూడదని హెచ్చరించారు. WHO మార్గదర్శకాల ప్రకారం, పెద్దలు 140 dB కంటే ఎక్కువ ధ్వని ఒత్తిడికి గురికాకూడదు. అలాగే పిల్లలు 120 dBకి మించి గురికాకూడదు. లైవ్ షోల సమయంలో వేదికపై ధ్వని స్థాయి 120 dB కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలను వేదికపైకి తీసుకెళ్లకూడదు.
Shyam Sundara Kulkarni: ప్రముఖ లిరిసిస్ట్ మృతి.. ఇండస్ట్రీలో విషాదం
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
అలాగే నోటీసులో, దిల్జిత్ పాత కచేరీలలో మద్యం మరియు మాదకద్రవ్యాలను ప్రోత్సహించే పాటలు పాడిన వీడియోలకు ఆధారాలుగా ఇచ్చి వాటిని రిపీట్ చేయవద్దని హెచ్చరించారు. ఇక ఢిల్లీలోని జవహర్‌లాల్ స్టేడియంలో జరిగిన దిల్-లుమ్నాటి సంగీత కచేరీలో పాటియాలా పెగ్, పంజ్ తారలా వంటి పాటలు దిల్జిత్ పాడారు. నిజానికి గత కొన్ని నెలలుగా దిల్జిత్ కచేరీకి సంబంధించి తీవ్ర వివాదం నడుస్తోంది. దిల్జిత్ లైవ్ షో అక్టోబర్ 26-27 తేదీల్లో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగింది. అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత స్టేడియంలో అపరిశుభ్రత వ్యాపించడం అందరినీ కలిచివేసింది. అక్కడ చెత్త కుప్ప చూసి షాక్ అయ్యారు. మద్యం, వాటర్ బాటిళ్లను అక్కడక్కడ విసిరేశారు. రన్నింగ్ ట్రాక్‌పై కుళ్లిపోయిన ఆహారం, కుర్చీలు విరిగిపోయి కనిపించాయి. ఇక ఆ చెత్త కారణంగా, ఆటగాళ్ళు తమ ప్రాక్టీస్‌ను ఆపేయాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!