GO 16 : తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తూ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 16ను కొట్టివేసింది. ఈ జీవో ద్వారా దాదాపు 8,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం చట్టపరంగా చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది. ముఖ్యంగా విద్య, వైద్య శాఖలలో ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం గమనార్హం. ఈ జీవో తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ, వారు హైకోర్టును ఆశ్రయించారు. వారి ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, జీవో 16 చట్టప్రకారం నిలబడదని తీర్పునిచ్చింది. తాజా తీర్పుతో రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆందోళన పెరిగింది. హైకోర్టు తీర్పు తీరుతో తమ భవిష్యత్తు గందరగోళంలో పడిందని వారు చెబుతున్నారు. ఈ సంక్షోభ పరిష్కారానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఎలాంటి మార్పు తీసుకురాగలవో వేచి చూడాల్సి ఉంది.
Game Changer : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పొలిటికల్ గేమ్ ఛేంజర్ ?