కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో భూమి కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తి అయిందన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని కోడెలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా కొండా సురేఖ తేల్చి చెప్పారు. ప్రభుత్వంపై బురదజల్లే రీతిలో కుట్రపూరితంగా ప్రచారమవుతున్న తప్పుడు వార్తలను మంత్రి సురేఖ ఖండించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనా విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ప్రజాపాలనా విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ప్రభుత్వం ఆహ్వానించింది.
“మన రోడ్లను నిర్మించింది మన సంపద కాదు... మన సంపదను నిర్మించింది మన రోడ్లు” అని అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడి అన్నారు. ఒక దేశాభివృద్ధిలో రహదారుల ఎంత కీలకమో ఆయన వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయి. తెలంగాణ ఏడాది క్రితం కొలువుదీరిన ప్రజా ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. మండలాల నుంచి జిల్లాలను కలిపే రహదారులు, జిల్లాల నుంచి రాష్ట్ర రాజధానిని కలిపే రాష్ట్ర రహదారులు, వివిధ జిల్లాల మీదుగా ప్రయాణించే జాతీయ…
NVSS Prabhakar : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంబరాలు ఎవరి కోసం చేస్తున్నారని వారికే అర్థం కావడం లేదని, సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన కొద్దీ గంటలకే వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. దేశంలోనే వర్గీకరణ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి ఒక్క అడుగు ముందుకు వేయలేదని, రాజకీయంగా మాదిగలను…
HYDRA : హైడ్రా (Hyderabad Water Resources Development and Reclamation Authority) హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, పార్కులను రక్షించి, వాటిని ఆక్రమణల నుంచి విముక్తి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థ. ఈ సంస్థ పారిశుద్ధ్య పరిశ్రమల పనితీరును మెరుగుపరచడం, పర్యావరణాన్ని సంరక్షించడం లక్ష్యంగా పనిచేస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే గ్రేటర్ పరిధిలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనట్లు సమాచారం అందినా అక్కడ అక్రమార్కుల భరతం పడుతున్నారు హైడ్రా…
HYDRA : హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, పార్కుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా (HYDRA) కు తెలంగాణ ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. మంగళవారం, హైడ్రా కార్యాలయ నిర్వహణకు, వాహనాల కొనుగోలుకు రూ.50 కోట్ల నిధులు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా ఆవిర్భావం తరువాత జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోని పలు చెరువులు, కుంటలు ఆక్రమణల నుండి విముక్తి పొందాయి. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి నగరంలోని పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ సంస్థ…
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం పేదల కుటుంబాలపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించే లక్ష్యంగా గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ చొరవ కింద, నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. దీంతో ఈ కుటుంబాలకు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో ఆర్థిక భారం గణనీయంగా తగ్గింది. తాజాగా ఈ పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. బడుగు బలహీన వర్గాల ఇళ్లలో…
Elevated Corridor : ఎన్హెచ్ 44లోని ప్యారడైజ్ జంక్షన్ నుండి డైరీ ఫామ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 62,152 చదరపు గజాల (12.84 ఎకరాలు)ను సేకరించేందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ భూములను తిరుమలగిరి మండలం భోలక్పూర్, తోకట్ట, సీతారాంపురం, బోవెన్పల్లి గ్రామాల పరిధిలోని సేకరిస్తున్నారు. ఇంతలో, అధికారులకు తీవ్రమైన సవాళ్లను కలిగిస్తూ, ప్రాజెక్ట్ కోసం సేకరించాల్సిన భూమిలో మతపరమైన నిర్మాణాలు, స్మశాన వాటికలు, విద్యా సంస్థలు, నివాస అపార్ట్మెంట్లు…