Guvvala Balaraju: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేవలం కేసీఆర్ ఒక్కరే పోరాటాలు చేశారా? అని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. తాజాగా ఎన్టీవీ క్వశ్చన్ హవర్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది పోరాటం చేశారు. అయినప్పటికీ కేసీఆర్ పట్టువిడవకుండా పోరాటం చేశారని ప్రశంసిస్తూ వచ్చానన్నారు. కేసీఆర్ బిక్ష వల్లే ఎమ్మెల్యే అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ లేకుంటే.. కేసీఆర్ లేకుంటే మీరు ఎమ్మెల్యే అయ్యేవారే కాదు. మీరు వార్డు మెంబర్‌కే సరిపోరు…
బనకచర్ల పై అసెంబ్లీలో కేసీఆర్ చర్చకు సిద్ధమా..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రైతు భరోసా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2016లో గోదావరిలోకి 3 వేల టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది మీరు కాదా? అని నిలదీశారు.
MP Balram Naik: ములుగు జిల్లాలో జరిగిన ఇంద్ర మహిళ పట్టాల పంపిణీ కార్యక్రమం సభ రాజకీయ వ్యాఖ్యలతో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు, ములుగు ఎంపీ బలరాం నాయక్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ.. ములుగు జిల్లాలోని నా పరిధిలో ఉన్న రెండు మండలాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత సీతక్కదే అని స్పష్టం చేశారు.…
మాజీ సీఎం కేసీఆర్‌పై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "కేసీఆర్ అంటే నాకు గౌరవం. పరిపూర్ణత చెందిన నాయకుడి అని నేను భావిస్తా. కేసీఆర్ పదేళ్లు సీఎంగా పని చేశారు... చాలా అనుభవజ్ఞులు" అని జగ్గారెడ్డి అన్నారు. కానీ.. గాంధీ కుటుంబంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి భయానికే కేసీఆర్ అసెంబ్లీకి పోవడం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్‌ను కడిగేస్తాడు అని భయం పట్టుకుందన్నారు. అది తప్పించుకోవడానికి…
KTR: తెలంగాణ భవన్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ వ్యక్తిత్వం, నాయకత్వం, రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్రను కొనియాడారు. అంబేద్కర్ నేతృత్వంలోని కమిటీ తీసుకున్న కీలక నిర్ణయాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కేటీఆర్ తెలిపారు. ఆయన ఆలోచన నాయకత్వం వల్లే మనకు ఈరోజు తెలంగాణ లభించింది. అంబేద్కర్ కారణంగానే మనకు అత్యుత్తమ రాజ్యాంగం లభించిందని…
KTR : ఈనెల 29వ తేదీన కరీంనగర్ లో జరిగే దీక్ష దివాస్ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివాస్ ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్ష దివాస్ నిలుస్తుందన్నారు కేటీఆర్. 2009, నవంబర్ 29వ తేదీన భారత రాష్ట్ర సమితి (అప్పటి…
ట్విట్టర్ వేదికగా విజయశాంతి ఓ పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇయ్యలేదు, తెలంగాణ ప్రజలు ఉద్యమాలతో తెచ్చుకున్నారు అని మంత్రి హరీష్ రావు ఇప్పుడు అంటున్నారు అని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమాల ఫలితంగా బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణ ఏర్పాటును సాధ్యం చేసినది నిజం.. అయితే.. బీఆర్ఎస్ చెప్పుకుంటున్నట్లు వారి ముఖ్యమంత్రి కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి తెచ్చింది అబద్దం, హాస్యాస్పదం అని ఆమె అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ విభజన సరిగ్గా జరుగలేదని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని మంత్రి కేటీఆర్ అన్నారు.
తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కారణం అయ్యాయి. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ ప్రధాని మోడీ కాదు కేడీ అన్నారు. ప్రధాన మంత్రికి ఉన్న గౌరవం పోయింది. కనకపు సింహాసనమున శునకము కూర్చుందని దుయ్యబట్టారు. దేశానికి ప్రధాన మంత్రి ఉన్న ఏ ఒక్క రాష్టానికి న్యాయం చేయలేదు. 7 ఏళ్లలో కేంద్రం నుంచి రెండు రాష్ట్రాలకు ఒక్క నయాపైసా ఇవ్వలేదు. తలుపులు బిగించి…