Minister KTR: రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ విభజన సరిగ్గా జరుగలేదని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని అవమానకర వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు.. చారిత్రక వాస్తవాల పట్ల ఆయనకున్న నిర్లక్ష్యానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమేనంటూ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు రాష్ట్ర సాధన కోసం ఆరు దశాబ్దాలుగా అవిశ్రాంతంగా పోరాడారు.. జూన్ 2, 2014న రాష్ట్ర అవతరణ కల సాకారం చేసుకున్నారు అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.
Read Also: Parliament Building: పాత పార్లమెంట్ భవనాన్ని ఏం చేస్తారు.. కూల్చేస్తారా?
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
అయితే, అంతకు ముందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఏపీ, తెలంగాణ విభజనపై వ్యాఖ్యనించారు. యూపీఏ హయాంలో ఈ పార్లమెంట్ లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని.. అయితే ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మాదిరిగా ఏపీ, తెలంగాణ విభజన సరిగ్గా జరుగలేదని ఆయన కోనియాడారు. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు మూడు రాష్ట్రాల విభజన ఎంతో ప్రణాళికా బద్ధంగా చేశారని మోడీ తెలిపారు. ఆ మూడు రాష్ట్రాల విభజన టైంలో అన్ని చోట్లా సంబరాలు జరిగాయన్నారు.
Read Also: Rohit Sharma: సిరాజ్ ఇంకొన్ని ఓవర్లు వేస్తే ఒకటో, రెండో వికెట్లు తీసేవాడు..
ఏపీ, తెలంగాణ విభజన టైంలో ఎక్కడా సంబరాలు జరుగలేదు అని ప్రధాని మోడీ అన్నారు. స్వార్థ రాజకీయాల కోసమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను హడావుడిగా విభజించారన్నారు. అత్యంత దారుణంగా ఏపీని విభజించారన్నారు. మైకులు ఆపేసి, పెప్పర్ స్ప్రే జల్లి అత్యంత సిగ్గుచేటుగా చేశారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఎంతో మంది బలిదానాలు చేసుకున్నారు.. అయినా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో సెలబ్రేషన్స్ జరుగలేదు.. విభజన అంశంలో ఎలాంటి చర్చ జరపకుండానే ఏపీ, తెలంగాణ విభజన చేసి కాంగ్రెస్ పార్టీ చేతులు దులుపుకుందని ప్రధాని మోడీ ఆరోపించారు. ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ చాలా కీలకం.. అలాంటి వ్యవహారాన్ని తూతు మాత్రంగా చేశారన్నారు.
మోదీ…తెలంగాణ విరోధి!
తెలంగాణ మీద పదే..పదే అదే అక్కసు
ఎందుకు ప్రధాని..?అమృతకాల సమావేశాలని పేరుపెట్టి
విషం చిమ్మడం ఏం సంస్కారం ..?తెలంగాణ అంటేనే గిట్టనట్టు..పగబట్టినట్టు
మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా..?తల్లిని చంపి బిడ్డను తీసారని
అజ్ఞానం..అహంకారంతో ఇంకెన్నిసార్లు
మా… https://t.co/3tNjBJSVOK— KTR (@KTRBRS) September 18, 2023
తాజావార్తలు
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
-
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!