Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 4 పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవరు అందోళన చెందవద్దు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల లబ్ధి జరుగుతుందన్నారు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈరోజు నుండి గ్రామాల్లో గ్రామ సభలు, వార్డు సభలు జరుగుతుండడంతో అక్కడికి వెళ్లి అధికారుల…
Gauri Satish : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల షాబాద్‌లో దీక్ష పేరిట రైతులను మోసం చేసింది బీఆర్ఎస్ అని ఆరోపించారు తెలంగాణ స్పోక్స్ పర్సన్ గౌరీ సతీష్. పవిత్రమైన చేవెళ్లని బీఆర్ఎస్ నాయకులు అపవిత్రం చేశారని శుద్ధి కార్యక్రమం చేపట్టింది చేవెళ్ల కాంగ్రెస్. ఈ కార్యక్రమంలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్, తెలంగాణ స్పోక్స్ పర్సన్ గౌరీ సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా…
Tummala Nageswara Rao : పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు గుర్తుకురాని రైతులు ఈ రోజు బీఆర్‌ఎస్ నాయకులకు గుర్తుకు వస్తున్నారా అని ప్రశ్నించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు బంధు నాట్లు వేసేటప్పుడు ఇచ్చాం అంటున్న వారికి, ప్రతి పంట కాలములో రైతుబంధు ఎప్పుడు మొదలు పెట్టి ఎప్పటిదాకా ఇచ్చారో తెలియకపోతే ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుండేదన్నారు. రైతుబంధు పేరు చెప్పి పంటల భీమా, వ్యవసాయ యాంత్రికరణ పథకాలకు తిలోదకాలు ఇచ్చింది…
హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీటిని అందించడంలో ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హుజురాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో కాకతీయ కాలువ ద్వారా నీరు కొనసాగుతున్నప్పటికీ, డీబీఎం 16 ద్వారా హుజురాబాద్ రైతులకు నీరును అందించకుండా నిర్లక్ష్యం చూపుతున్నారని, ఇది అసహనానికి గురిచేస్తోందన్నారు. ఖమ్మం కోసం నీటిని…
Harish Rao : 80 లక్షల మంది రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. విజయవంతంగా రైతు భరోసాని సీఎం ఎగ్గొట్టారన్నారు. రైతు భరోసాలో కోతలు పెట్టడానికి సీఎం, మంత్రులు కష్టపడుతున్నారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు పంటలకు రైతు భరోసా ఇవ్వాలన్న రేవంత్ ఇప్పుడు మాట మార్చారన్నారు హరీష్ రావు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ నాలుకకు నరం లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారని, తెలంగాణలో సగం మంది…
Tummala Nageswara Rao : ఖమ్మం సత్తుపల్లి వ్యవసాయ క్షేత్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సంవత్సర కాల పాలనలో 21 వేల కోట్ల రుణామాఫీ, 7,625 వేల కోట్ల రైతు బంధు, 3 వేల కోట్ల రైతు భీమా ఇచ్చామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు…
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉంది.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు ముందుకు వెళ్తామని రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు, కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు, దుదిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…
Solar Power : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పంట సాగుతో పాటు సౌర విద్యుత్ ఉత్పత్తిని అనుసంధానించేందుకు వినూత్న కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ (PM-KUSUM) పథకంలో భాగంగా, రాష్ట్రంలోని రైతులకు తమ వ్యవసాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లూ ఈ వివరాలను వెల్లడించారు.…
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లపై వివరాలను అధికారుల నుంచి తెలుసుకోనున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కోసం ఇంటింటికి సర్వేలు చేపడుతున్న ప్రభుత్వం.. చాలా వరకు సర్వేను పూర్తి చేసింది. అయితే… సంక్రాంతి తర్వాత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేసే యోచనలో తెలంగాణ సర్కార్ ఉంది. ఈ క్రమంలోనే అధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించనున్నారు సీఎం…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం పరిస్థితి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్రమైన విమర్శలు చేసారు. ఆయన రాహుల్ గాంధీకి రాసిన బహిరంగ లేఖలో కాంగ్రెస్ పాలన రాష్ట్రంలో ప్రతివర్గాలకు ముప్పు తెస్తోందని ఆరోపించారు. తెలంగాణ రైతుల నుండి మహిళల వరకు అన్ని వర్గాలు కాంగ్రెస్ సర్కార్ వల్ల అరిగోస పడుతోందని చెప్పారు. ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వ పయనంలో రాష్ట్రం దిగజారిపోయిందని, ప్రజల సమస్యలపై కాంగ్రెస్ నేతలు పట్టించుకోకుండా ఢిల్లీకి, ప్రభుత్వ…