CM Revanth Reddy: తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా నిధులను జమ చేస్తామని తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా రైతులందరికీ రైతు భరోసాను అందజేస్తామని ప్రకటించారు. 9 రోజుల్లోనే రైతులందరి అకౌంట్లలోకి రైతు భరోసా నగదు పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
అమెరికాలో ఉద్యోగం చేసిన కవితకు తెలంగాణ పౌరుషం లేదని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి అన్నారు. తమ లాంటి వారికి తెలంగాణ వాదం నేర్పించింది బీజేపీ అని.. తమకు కాకుండా ఇంకెవరికి తెలంగాణ పౌరుషం ఉంటది? అన్నారు. తమది హిందుగాళ్లు బొందు గాళ్లు అన్న రక్తం కాదని.. కవిత స్టేట్మెంట్ ఇచ్చే ముందు స్థాయి చూసుకోవాలని విమర్శించారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
Rythu Bharosa : త్వరలోనే రైతులకు మంచి రోజులు రాబోతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం చిన్నదైనా, కొత్తదైనా ఆర్థికంగా ఎదురైన సమస్యలను అధిగమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత‍్వం కృషి చేసిందని తెలిపారు. ఆర్థిక బాద్యతల మధ్యలోనే సీఎం రుణమాఫీ చేసినట్టు పేర్కొన్నారు. గత ఏడాది ఖరీఫ్ పంట కాలంలో రైతుల ఖాతాల్లో ఏకంగా రూ.33,000 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. దేశంలో అత్యధికంగా ధాన్యం సేకరించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు.…
Monsoon : తెలంగాణలో వర్షాకాలం త్వరితగతిన ప్రారంభమవుతోంది. సాధారణంగా జూన్ రెండో వారంలో రాష్ట్రంలో ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon), ఈసారి అంచనా వేసిన సమయానికంటే ముందుగానే రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశించాయి. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఈసారి నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతూ, రెండు రోజుల వ్యవధిలో రాష్ట్రం మొత్తం మీద విస్తరించే అవకాశముంది. ఈ పరిణామం రైతులకు ఉత్సాహాన్నివ్వడమే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి లభ్యత, నీటి వనరుల నిల్వ, పౌర…
బీజేపీ అధికారంలోకి వస్తే మేడిగడ్డపై సీబీఐ విచారణ చేయిస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీటలు వారుతున్న పరిస్థితిలో కాంగ్రెస్ కు తెలివి వచ్చిందని.. సీబీఐ విచారణకు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడుగా తాను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ మునిగి పోతున్న నావ అని ఎద్దేవా చేశారు. డాటార్ డాడీల మధ్య ఉత్తరాలు ఇంకా జరుగుతాయని విమర్శించారు.. కుటుంబ పార్టీలు ప్రజల కొంపలు ముంచుతాయన్నారు.…
అచ్చంపేట నియోజకవర్గంలో అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ‘నల్లమల డిక్లరేషన్’ను సైతం ఆవిష్కరించారు. ఈ డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం నల్లమల ప్రాంతం గురించి సీఎం ప్రసంగించారు. ఒకప్పుడు నల్లమల అంటే వెనుకబడిన ప్రాంతం. ఎవరో ఒక నాయకుడు వచ్చి అభివృద్ధి చేయాలని అనేవారని నాటి రోజులను సీఎం గుర్తు చేశారు. సీఎంగా ఇక్కడి నుంచి…
CM Revanth Reddy : తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో కలిసి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా నిలిచే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దతామని…
Bandi Sanjay : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. మెదక్ జిల్లా ఎల్లారెడ్డిపేటలో జరిగిన సభలో ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. “కాంగ్రెస్ ఖేల్ ఖతం, దుకాణ్ బంద్” అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం స్వయంగా చేసిన వ్యాఖ్యలే వారి వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్,…
Shabbir Ali : కామారెడ్డి జిల్లాలోని మల్టీస్టేజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన ప్రాణహిత-చేవెళ్ల పునరుజ్జీవన దిశగా సాగుతుంది. కామారెడ్డి జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అనంతరం మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి ప్రజల జీవనాధారం ఈ ప్రాజెక్టు అని పేర్కొన్న ఆయన, ప్రాజెక్టు పూర్తయితే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో రూ.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. ఇటీవల ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్…
Big Breaking : తెలంగాణ భూ భారతి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం, దీని ప్రయోజనం రాష్ట్రంలో భూ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించడం , రైతులకు, పర్యావరణానికి అనుకూలంగా భూముల వినియోగాన్ని ప్రోత్సహించడం. ఈ కార్యక్రమం, తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్, భూమి చట్టాలు, ఆస్తి హక్కుల పునరుద్ధరణ వంటి ముఖ్యమైన అంశాలను కవర్ చేస్తుంది. భూ భారతి కార్యక్రమం ద్వారా, ప్రభుత్వమే భూముల ఖాతాలు, రికార్డులను సరికొత్తగా సృష్టించి వాటి మాలికల…