MLC Kavitha : తెలంగాణలో పలు ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్ల వద్ద యూరియా కోసం రైతులు తడిసిమోసిన జల్లులా క్యూ లైన్‌లో నిలబడుతున్నారు. ఈ పరిస్థితిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఆమె ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా మాట్లాడుతూ, “ఇది నో స్టాక్ సర్కార్. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాజుగా ఉన్న రైతు, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ రోడ్డు మీద పడిపోయాడు,” అంటూ వ్యాఖ్యానించారు. రైతులకు…
KTR : హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో కాంగ్రెస్ నేతల అక్రమాలకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మరిచిపోయి, ఇప్పుడు రైతులకు ఇవ్వాల్సిన భూములను కాంగ్రెస్ నేతలు స్వాధీనం చేసుకుంటున్నారన్న ఆరోపణలు చేశారు. కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌లో, “రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకు హక్కుగా రావాల్సిన ఇంటి…
Weather Updates : తెలంగాణ ప్రజల నిరీక్షణకు తెరపడింది.. ఎప్పటిలా కాకుండా, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రెండు వారాల ముందే పలకరించాయి, జూన్ చివరి వారంలోనే రాష్ట్రవ్యాప్తంగా తొలకరి జల్లులతో స్వాగతం పలికాయి. ఇది కేవలం వాతావరణ మార్పు కాదు, రైతన్నల ముఖాల్లో చిరునవ్వు, బీడు భూములకు జీవం, నగరవాసులకు ఉపశమనం.. సాధారణంగా జూన్ రెండో వారంలో మొదలయ్యే రుతుపవనాలు, ఈసారి కాస్త తొందరగానే తెలంగాణ గడ్డను తాకాయి. దీనికి కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.…
తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులు పండుగ చేసుకోవాలని సూచించారు. రైతు భరోసా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.ప్రజల ఆశీర్వాదంతో జెడ్పీటీసీ, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యే, అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో జరిగిన ఉద్యమాలు తనకు తెలుసని.. భూమి చుట్టూ మన త్యాగాలు, జీవితాలు ఉన్నాయన్నారు.. వ్యవసాయం దండుగా…
దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లికించదగ్గ రోజు, ఈరోజు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 70 లక్షల మంది రైతులకు తొమ్మిది రోజుల్లో రూ. తొమ్మిది వేల కోట్లు వారి ఖాతాల్లో వేశామని గుర్తు చేశారు. రైతు భరోసా విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన మహాను భావుడు రాజీవ్ గాంధీ అన్నారు. వ్యవసాయం అంటే కాంగ్రెస్... కాంగ్రెస్ అంటే వ్యవసాయమని తెలిపారు. రైతులకు మద్దతు ధర ఇచ్చింది…
రైతు భరోసా నిధుల పంపిణీలో రికార్డు సృష్టించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేవలం 6 రోజుల్లో రూ. 7700 కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. ఏడేండ్లలో రైతులకు నిధుల పంపిణీలో ఇదే రికార్డు అని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ప్రకారం.. రాష్ట్రంలోని రైతులకు వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా అందించటంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు నమోదు చేసింది. తొమ్మిది రోజుల్లో రూ. 9…
రైతు భారోసా నిధులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. నాలుగు ఎకరాల వరకు రైతుభరోసా నిధులు జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రైతుభరోసా కోసం మరో రూ.1313.53 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. మరో వారంలోగా పూర్తిగా రైతుభరోసా నిధుల జమ చేస్తామని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులకు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదని విమర్శించారు.
CM Revanth Reddy: తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా నిధులను జమ చేస్తామని తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా రైతులందరికీ రైతు భరోసాను అందజేస్తామని ప్రకటించారు. 9 రోజుల్లోనే రైతులందరి అకౌంట్లలోకి రైతు భరోసా నగదు పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
అమెరికాలో ఉద్యోగం చేసిన కవితకు తెలంగాణ పౌరుషం లేదని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్రెడ్డి అన్నారు. తమ లాంటి వారికి తెలంగాణ వాదం నేర్పించింది బీజేపీ అని.. తమకు కాకుండా ఇంకెవరికి తెలంగాణ పౌరుషం ఉంటది? అన్నారు. తమది హిందుగాళ్లు బొందు గాళ్లు అన్న రక్తం కాదని.. కవిత స్టేట్మెంట్ ఇచ్చే ముందు స్థాయి చూసుకోవాలని విమర్శించారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
Rythu Bharosa : త్వరలోనే రైతులకు మంచి రోజులు రాబోతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం చిన్నదైనా, కొత్తదైనా ఆర్థికంగా ఎదురైన సమస్యలను అధిగమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. ఆర్థిక బాద్యతల మధ్యలోనే సీఎం రుణమాఫీ చేసినట్టు పేర్కొన్నారు. గత ఏడాది ఖరీఫ్ పంట కాలంలో రైతుల ఖాతాల్లో ఏకంగా రూ.33,000 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. దేశంలో అత్యధికంగా ధాన్యం సేకరించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు.…