Telangana Urea Supply: ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల పోరాటం ఫలించింది. రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరాపై వారు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టడంతో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ స్పందించింది. ఈ వారంలోనే తెలంగాణకు 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా కర్ణాటక నుంచి 10,800 మెట్రిక్ టన్నుల యూరియా రవాణా ఇప్పటికే ప్రారంభమైంది. అదేవిధంగా ఈ వారంలోనే మరిన్ని మూడు షిప్‌మెంట్‌ల ద్వారా యూరియా సరఫరా చేయాలని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి.
Bhadrachalam: భద్రాచలంలో ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. ఒకటవ ప్రమాద హెచ్చరిక జారీ!
రైతుల కష్టాలు దేశానికి తెలియజేసే విధంగా పోరాటం చేసిన ఎంపీలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. రైతాంగ ప్రయోజనాల కోసం చేసిన ఈ పోరాటం వలననే యూరియా సమస్య పరిష్కారమైందని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు రాజకీయ స్వార్థం కోసం కుట్రలు చేస్తున్నాయనీ, వాటిపై రైతాంగం ఆలోచించాల్సిన అవసరం ఉందని మంత్రి హెచ్చరించారు. తెలంగాణకు కేటాయించిన యూరియా సరఫరా సకాలంలో జరగకపోవడం కేంద్ర వివక్ష కారణంగానే అని ఆయన స్పష్టం చేశారు. రైతాంగం శ్రేయస్సు కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు.
Drunk Youth Attack Police: తాగుబోతుల వీరంగం.. పోలీసులపై దాడి.. పరారీలో యువకులు!