గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) లేఖ రాసింది. గోదావరి - బనకచర్ల లింక్ విషయంలో ఏపీ ముందుకెళ్లకుండా చూడాలని లేఖలో పేర్కొంది. ఎలాంటి అనుమతుల్లేకుండా ప్రాజెక్టు చేపడుతున్నారని గతంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపామని ఈఎన్సీ వెల్లడించింది. పనులు విభజన చట్టం, ట్రైబ్యునల్ అవార్డులకు విరుద్ధమని... తెలంగాణకు నష్టం జరుగుతుందన్న ఈఎన్సీ తెలిపింది.
కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రెండు కాంపోనెంట్లుగా (1.14 మరియు 1.15) గెజిట్ నోటిఫికేషన్లో పొందుపరిచారు. అవి రెండూ ఒకే కాంపోనెంట్ గా పొందుపర్చాలని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే KRMB కి లేఖ రాసింది. గెజిట్ నోటిఫికేషన్ లో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రెండవ కాంపోనెంట్ ను 25 టిఎంసీల నుండి 40 టిఎంసిల వరకు పెంచినదిగా చూపించారు. అది తప్పు అని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.…