KTR: ఈసీ నోటీస్ లకు బదులు ఇస్తాం.. క్లారిటీ ఇచ్చిన కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: నాకు వచ్చిన ఈసీ నోటీస్ లకు బదులు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి కేటీఆర్‌కు ఎన్నికల సంఘం షాకిచ్చిన విషయం తెలిసిందే.. మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ కార్యాలయమైన టీ-వర్క్స్‌ను వినియోగిస్తున్నారని, టీ-వర్క్స్‌లో నిరుద్యోగులను కేటీఆర్ ఎలా ఇంటర్వ్యూ చేస్తారంటూ ఇటీవల కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జీవాలా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విసయం తెలిసిందే.. కోడ్ ఉల్లంఘించినందుకు తనపై చర్యలు తీసుకోవాలని రణదీప్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయమూ తెలిసిందే.. అయితే ఆయన ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల సంఘం మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయమైన టీ-వర్క్స్ సెంటర్‌ను రాజకీయ కార్యక్రమానికి ఎలా ఉపయోగించుకుంటారన్న అంశంపై ప్రతిపక్ష పార్టీలు కూడా కేటీఆర్‌పై మండిపడుతున్నాయి… అలా చేసిన తర్వాత అన్ని విషయాలపై విచారణ ఈసీ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ప్రైమరీ ఎన్నికల నిబంధనలను కేటీఆర్ ఉల్లంఘించారని ఈసీ భావిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు విధించారు. మరి కేటీఆర్ ఇచ్చిన వివరణతో ఎన్నికల సంఘం సంతృప్తి చెందుతుందా? లేక కేటీఆర్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా అన్నది తేలాల్సి ఉంది.
Read also: Minister KTR: రైతు బంధు కొత్త స్కీమ్ కాదు… కొనసాగుతున్న స్కీమ్
Also Read
తెలంగాణ రాష్ట్ర కోసం నవంబర్ 29, 2013 న కేసీఅర్ ఆమరణ దీక్ష కు దిగారని గుర్తు చేశారు. కేసీఅర్ పోరాటంతో కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందన్నారు. గత 14 ఏళ్లుగా నవంబర్ 29 న దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ నిర్వహిస్తుందన్నారు. ఈ సారి దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించుకోవలని పార్టీ శ్రేణులను కోరుతున్నామని అన్నారు. నవంబర్ 29 ఎక్కడి వారు అక్కడ తోచిన విధంగా సేవ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. దేశ విదేశాల్లో కూడా దీక్షా దివస్ నిర్వహణ కొనసాగుతుందని అన్నారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందన్నారు. కాంగ్రెస్ అవుట్ అయిన పార్టీ… ఎంత వాగిన లాభం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. మా నేతల మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. పీఎం కిసాన్ వేసినప్పుడు రేవంత్ ఎందుకు మాట్లాడారు ? అని ప్రశ్నించారు. రైతు బంధు కొత్త స్కీమ్ కాదు …కొనసాగుతున్న స్కీమ్ ఇది అని స్పష్టం చేశారు. రేవంత్ 3 గంటలు… డీకె శివ కుమార్ 5 గంటలు కరెంట్ అంటున్నారన్నారు. కానీ మేము 24 గంటలు కరెంట్ ఇస్తాం అంటున్నాం అని గుర్తు చేశారు. కర్ణాటక వాళ్ళు ఇక్కడ ప్రచారం చేయడం ఏంటి ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను నమ్ముతాం అంటే…. వారి అవగాహన అన్నారు. గోషామహల్ లో కూడా బీజేపీని ఓడిస్తాం అన్నారు.
Faria Abullah : పొట్టి నిక్కర్ లో థండర్ థైస్ చూపిస్తూ ఫరియా అబ్దుల్లా సండే ట్రీట్..
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?