Revanth Reddy: చర్లపల్లి జైల్లో కేసీఆర్ కు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరుకే నారాయణపేట జిల్లా అయింది… ఇక్కడ కనీస మౌళిక వసతులు లేవన్నారు. పర్ణిక రక్తంలోనే త్యాగం ఉంది.. సేవా గుణం ఉందన్నారు. నారాయణ పేట-కొడంగల్ ఎత్తిపోతల ఆలోచన చేసి అనుమతులు తెచ్చిందే కీ.శే.చిట్టెం నర్సిరెడ్డి అని తెలిపారు. ఇక్కడి చెరువులు నిండాలని, కోస్గి, దామరగిద్ద ప్రాంతాలకు నీళ్లు రావాలని నిధులు తెచ్చింది తనే అని అన్నారు. చిట్టెం నర్సిరెడ్డి, జైపాల్ రెడ్డి చివరి రక్తపు బొట్టు వరకు ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు. ఇక్కడి ఎమ్మెల్యే బస్టాండ్ లో తిని బజారులో పడుకుంటాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేను కలవాలంటే రాయచూరు వెళ్లాల్సిన పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఉద్దెర జీతగాడు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. పర్ణికకు వేసే ప్రతి ఓటు రేవంత్ రెడ్డికి వేసినట్లే అన్నారు. ఈ ఎన్నికల్లో రాజేందర్ రెడ్డిని రాయచూరు పంపుదాం.. కేసీర్ ను ఫామ్ హౌస్ కు పంపుదాం అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. కేసీఆర్ కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించడం ఖాయం అన్నారు.
Read also: RK Roja: చంద్రబాబు పురాతన దేవాలయాలు కూల్చి.. బాత్‌రూంలు కట్టాడు!
బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో అని తెలంగాణ రాష్ట్ర స్థానిక ప్రజాప్రతినిధులకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిజ ప్రజాప్రతిందుల దుస్థితిపై లేఖలో వివరించారు. జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాకు స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత తెలుసని అన్నారు. ఏ ప్రభుత్వ పాలన కైనా మీరే పునాదులు అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మీ అవస్థలు.. మీకు జరిగిన అవమానాలు నాకు తెలుసన్నారు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని కేసీఆర్ పురుగులకంటే హీనంగా చూశారని తెలిపారు. నిర్ణయాధికారం లేక, నిధులు రాక మీరు పడిన బాధలు గుర్తున్నాయని రేవంత్ తెలిపారు. సర్కారు నిధులు రాకున్నా భార్య మెడలో బంగారం అమ్మి అభివృద్ధి చేసిన వాళ్లు ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. ఊరి కోసం అప్పుచేసి వడ్డీలు కట్టలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు ఉపాధి హామీ కూలీలుగా, వాచ్ మెన్ లుగా చేస్తున్నారని గుర్తు చేశారు.
Israel Hamas War : వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెలీ ‘గూఢచారులు’… బహిరంగంగా కాల్చిచంపిన పాలస్తీనియన్లు