Minister KTR: రైతు బంధు కొత్త స్కీమ్ కాదు… కొనసాగుతున్న స్కీమ్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర కోసం నవంబర్ 29, 2013 న కేసీఅర్ ఆమరణ దీక్ష కు దిగారని గుర్తు చేశారు. కేసీఅర్ పోరాటంతో కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందన్నారు. గత 14 ఏళ్లుగా నవంబర్ 29 న దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ నిర్వహిస్తుందన్నారు. ఈ సారి దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించుకోవలని పార్టీ శ్రేణులను కోరుతున్నామని అన్నారు. నవంబర్ 29 ఎక్కడి వారు అక్కడ తోచిన విధంగా సేవ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. దేశ విదేశాల్లో కూడా దీక్షా దివస్ నిర్వహణ కొనసాగుతుందని అన్నారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందన్నారు. కాంగ్రెస్ అవుట్ అయిన పార్టీ… ఎంత వాగిన లాభం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. మా నేతల మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. పీఎం కిసాన్ వేసినప్పుడు రేవంత్ ఎందుకు మాట్లాడారు ? అని ప్రశ్నించారు. రైతు బంధు కొత్త స్కీమ్ కాదు …కొనసాగుతున్న స్కీమ్ ఇది అని స్పష్టం చేశారు. రేవంత్ 3 గంటలు… డీకె శివ కుమార్ 5 గంటలు కరెంట్ అంటున్నారన్నారు. కానీ మేము 24 గంటలు కరెంట్ ఇస్తాం అంటున్నాం అని గుర్తు చేశారు. కర్ణాటక వాళ్ళు ఇక్కడ ప్రచారం చేయడం ఏంటి ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను నమ్ముతాం అంటే…. వారి అవగాహన అన్నారు. గోషామహల్ లో కూడా బీజేపీని ఓడిస్తాం అన్నారు. నాకు వచ్చిన ఈసీ నోటీస్ లకు బదులు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు.
Read also: Kishan Reddy: ఇది నాల్గవది అయినా స్పందించరా.. కేసీఆర్ కు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి కేటీఆర్‌కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ కార్యాలయమైన టీ-వర్క్స్‌ను వినియోగిస్తున్నారని, టీ-వర్క్స్‌లో నిరుద్యోగులను కేటీఆర్ ఎలా ఇంటర్వ్యూ చేస్తారంటూ ఇటీవల కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జీవాలా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కోడ్ ఉల్లంఘించినందుకు తనపై చర్యలు తీసుకోవాలని రణదీప్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల సంఘం మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయమైన టీ-వర్క్స్ సెంటర్‌ను రాజకీయ కార్యక్రమానికి ఎలా ఉపయోగించుకుంటారన్న అంశంపై ప్రతిపక్ష పార్టీలు కూడా కేటీఆర్‌పై మండిపడుతున్నాయి…అలా చేసిన తర్వాత అన్ని విషయాలపై విచారణ ఈసీ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ప్రైమరీ ఎన్నికల నిబంధనలను కేటీఆర్ ఉల్లంఘించారని ఈసీ భావిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు విధించారు. మరి కేటీఆర్ ఇచ్చిన వివరణతో ఎన్నికల సంఘం సంతృప్తి చెందుతుందా.. లేక కేటీఆర్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా అన్నది తేలాల్సి ఉంది.
Kishan Reddy: ఇది నాల్గవది అయినా స్పందించరా.. కేసీఆర్ కు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ..