Telangana Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు అధికార పార్టీని దెబ్బ తీసేందుకు కావాల్సిన వ్యూహాలకు పదును పెడుతున్నారు. నిన్న సోషల్ మీడియా వేదికగా కారు పార్టీని, సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ వినూత్న రీతిలో ప్రచారానికి తెర లేపారు. కాంగ్రెస్ పార్టీ సెటైరికల్ ట్వీట్ చేసింది. ‘తెలంగాణ ఎన్నికల ప్రశ్నాపత్రం: బుక్‌లెట్ నంబర్ కేసీఆర్ 420’ అనే పేపర్‌ను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు, గ్రూప్-1 పరీక్ష పేపర్ లీక్, దళితులకు మూడు ఎకరాల భూమి, ధరణి పోర్టల్, ఉద్యోగ నోటిఫికేషన్, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, కేజీ టు పీజీ విద్య, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లపై ప్రశ్నలు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీలో ఆదర్శ మహిళా నేత లేరన్న ప్రశ్నకు బదులిస్తూ ఏడో తరగతి పాసైన విద్యాశాఖ మంత్రి లికర్ కవిత ఆప్షన్లలో పేర్కొన్నారు. ఈ పేపర్ ఇప్పుడు లీక్ అయిందని కాంగ్రెస్ సెటైర్ వేసింది.
Read Also:Faria Abullah : పొట్టి నిక్కర్ లో థండర్ థైస్ చూపిస్తూ ఫరియా అబ్దుల్లా సండే ట్రీట్..
నేడు ఎన్ ఎస్ యు ఐ విద్యార్థులకు రేపు ఆన్లైన్లో నిర్వహించబోయే పరీక్ష పత్రాన్ని బల్మూరి వెంకట్ లీక్ చేశారు. టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షల పత్రాల లీక్ పై వినూత్న నిరసన చేపట్టారు. ఓయూ లైబ్రరీలో పరీక్ష పత్రాలను పంచిపెట్టి రేపు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలని బల్మురి వెంకట్ సూచించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, పనితీరు అనే అంశంపై ఈ ప్రశ్నాపత్రాన్ని రూపొందించారు.
Read Also:Vellampalli Srinivasa Rao: టీడీపీ ఆపీస్‌కు రమ్మన్నా వస్తా.. వెలంపల్లి శ్రీనివాసరావు ఛాలెంజ్!
Telangana Election Question Paper.
Question Booklet Number: KCR420. pic.twitter.com/NdSHpasYZG— Telangana Congress (@INCTelangana) November 25, 2023