తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాష్ట్రంలోని 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. ప్రచారంలో దూసుకెళ్లిన అభ్యర్థుల మైకులు మూగబోయాయి. రాజకీయ నాయకుల మైకులు, ప్రచార వాహనాలు, పార్టీల పాటలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈసీ నిబంధనల ప్రకారం పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. ఈ క్రమంలో.. రాష్ట్రంలో వైన్స్ షాపులు కూడా మూతపడనున్నాయి. 48 గంటల…
దశాబ్ద కాలంలో బలిదానాల మీద గౌరవంతో సమస్యలను లేవనెత్తుతున్నామని... కానీ ఎక్కడ పోటీ చేయలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు పోటీలో ఉన్నామని ఆయన తెలిపారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్‌ను గెలిపించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు.
Vijayashanthi Visits Manthani: ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు మద్దతుగా కాంగ్రెస్ నేత విజయశాంతి మంథని నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ నిర్వహించిన విజయభేరి భారీ బహిరంగ సభలో పాల్గొని ఆమె ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణా ప్రభుత్వంలో జరుగుతున్న హింసపై ఆమె మండిపడ్డారు. ‘నిరుద్యోగులను మోసం చేశావు. నేరెళ్లలో ఇసుక లారీ ఘటన.. లాయర్ వామన్ రావు దంపతులను నడిరోడ్డుపై నరికించి హత్య చేసిన ఘటన. నడిరోడ్డుపై రైతులకు సంకెళ్లు వేసి నడిపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్…
నెలరోజులుగా హోరెత్తించిన ప్రచారం పలు నియోజకవర్గాల్లో ముగిసింది. 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ముగియనుండగా.. మిగిలిన 13 నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 4 గంటలకే ప్రచారం ముగించారు. అందులో.. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో 4 గంటలకు ప్రచారం ముగిసినట్లుగా ఎన్నికల కమిషన్ తెలిపారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నన్ను ముఖ్యమంత్రి చేసి నా గౌరవాన్ని పెంచింది గజ్వేల్ గడ్డ అని తెలిపారు. గజ్వేల్ కి రైలు వస్తుందని అనుకోలేదు కానీ రైలు వచ్చింది.. గజ్వేల్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు. ఇతర దేశాల ప్రతినిధులు గజ్వేల్ కి వచ్చి మన అభివృద్దిని చూసి వెళ్తున్నారని తెలిపారు. అయ్యింది చాలా గొప్ప అంటే సరిపోదు..ఇంకా చాలా చేయాలన్నారు.…
వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లోని ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన జిల్లా ఈ వరంగల్ జిల్లా అని అన్నారు. భద్రకాళి మాత ఆశీర్వాదంతో మనం తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ఎలక్షన్స్ వస్తే పార్టీకి ఒక్కరు వస్తారని విమర్శించారు. తప్పకుండ మీరు అభ్యర్థుల గురించి మీరు ఆలోచించాలని పేర్కొన్నారు. ఎలక్షన్స్ ఐపోగానే దుకాణం మొదలవుతుంది.. పార్టీల చరిత్రల ఆధారంగా ఓటు వేయాలన్నారు. అప్పుడే అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్. ఈ సందర్భంగా ఓవైసీ అసదుద్దీన్, బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డిపై బహిరంగ సభలో నిప్పులు చెరిగారు.
కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ డివిజన్ ప్రజలకు ఇప్పటివరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ పేర్కొన్నారు. సుమారు పది సంవత్సరాలుగా ఈ సమస్యతో స్థానికులు ఇబ్బందులు పడుతున్న ఆ సమస్యను పరిష్కరించే వారే లేకుండా పోయారన్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు దీనదయాల్ నగర్ బస్తీ వాసుల కష్టాలు వర్ణనాతీతమని వెల్లడించారు.
Rahul Gandhi: ఈఎస్‌ఐ, పీఎఫ్ అందించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ కోరారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండగా, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారు.
Wines Closed for Next 3 Days in Telangana: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మంగళవారం (నవంబర్ 28) సాయంత్రం 5 గంటల నుంచి గురువారం (నవంబర్ 30) సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. ఈ విషయంపై వైన్స్, బార్ల యజమానులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముందస్తు సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల యజమానులను రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ అప్రమత్తం…