ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ తరుణంలో రాష్ట్రంలో ఎన్నో మలుపులు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్(భారత్ రాష్ట్ర సమితి) రైతు బంధు పథకం కింద డబ్బు పంపిణీ చేయడానికి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో 2023లో కూడా 2018 పునరావృతం కాగలదని ఆశించింది. ఇది ఎన్నికల ఫలితాలను నడిపిస్తుందని.. భారీగా ప్రభావం చూపుతుందని బీఆర్‌ఎస్ ఆశాభావం వ్యక్తం చేసిందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
2.5 కోట్ల రైతు కుటుంబాల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం ఆడుతోందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ లబ్ధి తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏమీ పట్టవన్నారు. నాడు తెలంగాణను ఎండబెట్టి సర్వనాశనం చేసిందన్నారు. నేడు తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నదని.. తాత్కాలికంగా కాంగ్రెస్ రైతుబంధును అడ్డుకోగలదేమో .. డిసెంబరు 3 తర్వాత అడ్డుకోలేదన్నారు.
తన సొంత ఇలాకాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సోమవారం కొడంగల్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కొడంగల్ నాకు అస్థిత్వాన్ని ఇచ్చింది.. పోరాటాన్ని నేర్పింది అని అన్నారు. 20 ఏండ్లు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాడానని తెలిపారు. ఈ కొడంగల్ గడ్డ... నా అడ్డా.. మీ బిడ్డ.. మీరు నాటిన మొక్క... రాష్ట్రానికి నాయకత్వం…
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి కాచిగూడ చౌరస్తా వరకు మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బీజేపీ కార్యకర్తలు, జనాలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్ షో జరుగుతున్నంత సేపు.. మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. 45 నిమిషాలు పాటు ఈ రోడ్ షో సాగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి కాచిగూడ చౌరస్తా వరకు 2.5…
ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి.. కానీ బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. 15 సంవత్సరాలు పోరాడి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్‌ఎస్ అని సీఎం తెలిపారు. సంగారెడ్డిలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ఉన్న తెలంగాణను ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో కలిపారని.. 58 ఏళ్ళు ఎన్నో గోసలు పడ్డామన్నారు.
నవంబర్ 30న జరుగునున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజల భవిష్యత్తు నిర్వహించబడుతుందని మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు. 9 సంవత్సరాల క్రితం సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారు.. కేవలం ప్రకటించడమే మాత్రమే కాదు తెలంగాణ అభివృద్ధి చేసే బాధ్యతను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఆయన తెలిపారు.
ఆదిలాబాద్ లో ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పర్యటిస్తున్నారు. అందులో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్నటినుండి నేను తెలంగాణాలో పర్యటిస్తున్నాను.. ఇక్కడ కాంగ్రెస్ అనుకూల వాతావరణం కనిపిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం ధరల పెంపుతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని ఆరోపించారు. అబద్దాలతో రెండుమార్లు అధికారంలోకొచ్చారని తెలిపారు. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం హామీలేవీ నెరవేర్చలేదని మండిపడ్డారు. 10 ఏళ్ళ తెలంగాణాలో…
హుజూరాబాద్ నియోజక వర్గం నుండి ఈటల రాజేందర్ ను గెలిపించండి.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని ఆయన పేర్కొన్నారు. పేదల తరుపున మాట్లాడినందుకే.. కేసీఆర్ ఈటలపై కక్ష్య పెంచుకొని పార్టీ నుండి బయటకి పంపారు అంటూ అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు.