KTR participate in Deeksha Divas: హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ చేపట్టిన ‘దీక్షా దివస్’పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్క్వాడ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గడువు మంగళవారం సాయంత్రం ముగిసిన నేపథ్యంలో ఈసీ అభ్యంతరం తెలిపింది. పార్టీ కార్యాలయాల్లో ప్రచారం నిర్వహించొద్దని ఈసీ అధికారులు అనగా.. దీక్షా దివస్ ఎన్నికల కార్యక్రమం కాదని బీఆర్‌ఎస్ నేతలు తెలిపారు. ఆపై తెలంగాణ భవన్‌కు మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. తెలంగాణ భవన్‌లో…
Kishan Reddy Visits Bhagyalakshmi Temple: తెలంగాణలో గురువారం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ జి కిషన్ రెడ్డి కోరారు. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయని, తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్లోని చార్మినార్ను వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని ఈరోజు కిషన్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం కిషన్…
Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పర్వం మంగళవారం సాయంత్రం ముగిసింది. గురువారం (నవంబర్ 30) పోలింగ్ డే. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. డీఆర్‌సీ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది చేరుకుంటున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లతో పాటు ఇతర సామగ్రిని అధికారులు పోలింగ్…
EC order for investigation on Padi Koushik Reddy Comments: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజైన మంగళవారం హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశారు. మీరు గెలిపిస్తే విజయయాత్ర.. లేకపోతే కుటుంబంతో సహా శవయాత్ర అంటూ సంచలన కామెంట్స్ చేశారు. కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపి.. నివేదిక అందించాలని హుజూరాబాద్ ఎన్నికల…
These precautions are mandatory for voters: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పర్వం ముగిసింది. గురువారం (నవంబర్ 30) తెలంగాణలో పోలింగ్ డే. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓటు వేసే ప్రాసెస్ ఏంటి?, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు ఓసారి తెలుసుకుందాం. గుర్తింపు కార్డు తప్పనిసరి:…
Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం సాయంత్రంతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అలా తెరపడిందో లేదో.. నిర్మల్ జిల్లాలోని భైంసాలో ఇలా ఘర్షణకు తెరలేచింది. పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ బంధువు ఇంటిలో డబ్బుల డంప్ ఉందనే సమాచారం మేరకు ఎఫ్ఎస్‌టీ టీమ్‌తో పోలీసులు సోదాలు చేశారు. దాంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమ దగ్గర డబ్బులు లేవని…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో.. అధికారులు పోలింగ్ కు ఏర్పాట్లు చేశారు. దీంతో పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకుంటున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది... ఈ క్రమంలో హైదరాబాద్ లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య అన్నారు. 2,400 మంది రౌడీ షీటర్స్ బైండోవర్ చేశామని సీపీ పేర్కొన్నారు. మరోవైపు.. 7 జోన్లలో 1600 మంది రౌడీ షీటర్స్ పై నిఘా పెట్టామని తెలిపారు. అంతేకాకుండా.. 2 లక్షలు వాహనాలు చెక్ చేశామని.. ఎన్నికల విధుల కోసం భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు.
తెలంగాణలో ఎన్నికల సంఘం తొలిసారిగా అమలు చేసిన హోమ్ ఓటింగ్ విధానం విజయవంతమైంది. పోలింగ్ కేంద్రానికి వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ విధానం చాలా బాగా ఉపయోగపడింది. గతంలో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటుహక్కును వినియోగించుకోలేకపోయేవారు. ఈ హోమ్ ఓటింగ్ ద్వారా వారంతా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాష్ట్రంలోని 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. దీంతో రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా సీఈఓ వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ప్రచారం చేయొద్దని సూచించారు. అంతేకాకుండా.. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయొద్దని తెలిపారు.