నెలరోజులుగా హోరెత్తించిన ప్రచారం పలు నియోజకవర్గాల్లో ముగిసింది. 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ముగియనుండగా.. మిగిలిన 13 నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 4 గంటలకే ప్రచారం ముగించారు. అందులో.. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో 4 గంటలకు ప్రచారం ముగిసినట్లుగా ఎన్నికల కమిషన్ తెలిపారు.
Read Also: CM KCR: తెలంగాణే ఆశగా, శ్వాసగా బతుకుతున్నా..
ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో విజయానికి సహకరించాలని రాజకీయ పార్టీల నేతలు ఓటర్లను వేడుకున్నారు. 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 2298 మంది పోటీ చేసి తమ శక్తియుక్తులను వినియోగించి ప్రజల మద్దతును కోరారు. కాగా.. నవంబర్ 30న జరిగే పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. మొత్తం 119నియోజకవర్గాలకు గానూ ఎన్నికల బరిలో 2,290 మంది ఉన్నారు. వారిలో 221మంది మహిళా అభ్యర్థులు పోటీలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. పోలింగ్ సందర్బంగా భద్రతా విధుల్లో 45వేల మంది తెలంగాణ పోలీసులు ఉండనున్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందే రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.. సమావేశాలు, ఇంటింటి ప్రచారం లాంటివి చేయవద్దని ఈసీ సూచించింది.
Read Also: Viral Video : అరె ఏంట్రా ఇది.. టీతో ఆ ప్రయోగాలేంట్రా బాబు.. వీడియో చూస్తే టీ జోలికి వెళ్లరు..