రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme P4R 5G Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యువతను లక్ష్యంగా చేసుకుని రియల్మీ (Realme) నుండి కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ realme P4R 5Gను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 8000mAh “టైటాన్ బ్యాటరీ”. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు వినియోగదారులకు బ్యాటరీ బ్యాకప్ అందుతుందని కంపెనీ చెబుతోంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు బైపాస్ ఛార్జింగ్, వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను కూడా అందించారు. వీటికి తోడుగా AI ఆధారిత పవర్ మేనేజ్మెంట్ టెక్నాలజీ బ్యాటరీ జీవితకాలాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
డిస్ప్లే:
realme P4R 5Gలో 6.8 అంగుళాల HD+ IPS LCD “సన్‌లైట్ డిస్ప్లే”ను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, గరిష్టంగా 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఈ డిస్ప్లే అవుట్‌డోర్‌లో కూడా బాగా కనపడుతుంది. ఇక పనితీరు విషయానికి వస్తే.. ఈ ఫోన్లో 6nm టెక్నాలజీ ఆధారిత MediaTek Dimensity 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత realme UI 7.0పై ఇది పనిచేస్తుంది. రెండు సంవత్సరాల సిస్టమ్ అప్డేట్లు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
Also Read
- 200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
- New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
- 7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
కూలింగ్ సిస్టమ్:
గేమింగ్, హెవీ యూజ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు 5300mm² AirFlow Vapour Chamber (VC) కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. One Tap Cooling ఫీచర్‌తో కలిసి ఇది BGMI, Free Fire వంటి గేమ్‌లలో స్థిరమైన 60fps పనితీరును అందిస్తుందని కంపెనీ తెలిపింది. కెమెరా విభాగంలో 50MP ప్రధాన రియర్ కెమెరాతో పాటు 8MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఫ్రంట్, రియర్ కెమెరాలు రెండూ “మోషన్ ఫోటో” ఫీచర్‌కు మద్దతు ఇస్తాయి. ఫోటోగ్రఫీ, వీడియోల కోసం AI ఆధారిత NEXT AI ఫీచర్లను కూడా ఇందులో చేర్చారు.
డిజైన్ పరంగా “ఫ్లోటింగ్ లైట్ డిజైన్”తో వచ్చిన ఈ ఫోన్లో కస్టమైజ్ చేయగల పల్స్ లైట్ ఎఫెక్ట్స్, AI పవర్ లైట్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఆర్మర్ షెల్ నిర్మాణంతో రూపొందించిన ఈ డివైస్ MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను పొందింది. IP65 రేటింగ్‌తో దుమ్ము, నీటి చిమ్ముర్ల నుంచి రక్షణను అందిస్తుంది.
ధర:
రియల్మీ P4R 5G మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 4GB+128GB వేరియంట్ ధర రూ.18,999 కాగా, 6GB+128GB వేరియంట్ ధర రూ.20,999, 6GB+256GB వేరియంట్ ధర రూ.22,999గా నిర్ణయించారు. బ్యాంక్ ఆఫర్లతో వీటి ధరలు మరింత తగ్గనున్నాయి. జూన్ 17 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్ మీ అధికారిక వెబ్సైట్లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!