PM Modi Tweet about Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) షురూ చేసింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్దకు ఇప్పటికే చేరుకున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే భారీ క్యూ ఉంది. చాలా మంది అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియ్గించుకుంటున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3.26…
Telangana Elections : ప్రజాస్వామ్యంలో ఓటు ప్రతి ఒక్కరి హక్కు. ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్ల ఓటు వాళ్లే వేసుకుంటారు. కానీ సీఎం కేసీఆర్ కు ఆ ఛాన్స్ లేదు. ఆయన పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లోనూ ఆయనకు ఓటు లేదు. కానీ సిద్ధిపేట జిల్లాలోని చింతమడకలో తనకు ఓటు ఉంది.
Here Is Process for Challenge Vote: ఎన్నికలు జరిగే సమయంలో ఓటర్ల పేర్లు జాబితాలో మిస్ అవ్వడం, కొందరు ఇతరుల పేరుతో దొంగ ఓట్లు వేయడం సర్వసాధారణం. చాలా మంది తమ ఓటును వేరొకరు వేస్తే.. చాలా నిరాశపడుతుంటారు. అదే సమయంలో వారికి ఏం చేయాలో కూడా అర్ధం కాదు. అలాంటి వారు అస్సలు నిరాశ పడాల్సిన అవసరం లేదు. మీ ఓటు మరొకరు వేసినా.. మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇందుకు పరిష్కారమే…
Telangana Elections 2023 Polling Start From 7AM: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరుగనున్న మూడో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరగనున్న ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్నది. 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌కు అవకాశం ఉండగా.. 13 నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌కు అవకాశం ఉంది.…
Bandi Sanjay Release Note: రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ నియోజవర్గంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుండగా బండి సంజయ్ సంచలన ప్రకటన ఇచ్చారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను సవాలు చేస్తూ బండి అనూహ్యంగా లేఖ విడుదల చేశారు. ‘గంగుల.. నీ సవాల్‌కు నేను రెడీ. భాగ్యలక్ష్మి వద్దకు కేసీఆర్‌ను రమ్మను. కరీంనగర్‌లో ఏ దేవాలయానికి రమ్మన్నా వచ్చేందుకు నేను సిద్ధం. డబ్బులు పంచలేదని…
Rain Alert to Telangana: తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య భారతదేశంతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలపై ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం సర్వం సిద్ధమవుతున్న క్రమంలో రాష్ట్రానికి వాతావరణ కేంద్రం వర్ష సూచన ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడనుందని కేంద్ర వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. Also…
Telangana Elections: రేపు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఊర్లకు బయలుదేరుతున్నారు. ఎక్కువగా యువత ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ఊర్లకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్‌స్టాండ్‌లు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని జూబ్లీబస్ స్టాండ్, ఎంజీబీఎస్‌లు జనాలతో నిండిపోయాయి. విద్యా, ఉపాధి, ఉద్యోగాల కోసం హైద్రాబద్ వచ్చిన వారంత ఓటు హక్కు మా బాధ్యత అంటూ సొంత ఊర్లకు పయనమవుతున్నారు. అయితే తగిన బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.…
What is Deposit in Elections: ఎన్నికల సమయంలో ఎక్కువగా నాయకులు నోట నుంచి వినే పదం ప్రత్యర్థి డిపాజిట్ కూడా గల్లంతు చేస్తా అంటూ. అయితే అసలు ఈ డిపాజిట్ అంటే ఏమిటి ? అనే విషయం చదువుకున్న చాలా మందికి కూడా తెలియదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అసలు ఆ సంగతి ఏంటి అనేది ఈ తెలంగాణ ఎన్నికల ముందు తెలుసుకుందాం పదండి. Telangana Elections 2023: ఎన్టీఆర్, చిరు, మహేష్…
Strict Action will be taken on Organisations working on November 30: నవంబర్ 30వ తేదీన అంటే రేపు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికలు ఇంకా గంటల వ్యవధిలోకి వచ్చేయడంతో సర్వత్రా ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. ఇక నవంబర్ 30వ తేదీన ఎన్నికల సంధర్భంగా సెలవు ప్రకటించాలని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా, వ్యాపార సంస్థలను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇక రేపు ఓటు హక్కు ఉన్న ప్రతి…
Case Filed on BRS Candidate Padi Koushik Reddy: హుజూరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు రోజైన మంగళవారం కౌశిక్ రెడ్డి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలపై కమలాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కమలాపూర్ ఎంపీడీవో ఫిర్యాదు మేరకు.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. Also Read: Rahul Dravid-BCCI: నెహ్రా వద్దన్నాడు.. రాహుల్‌కు బీసీసీఐ మరో…