తెలంగాణలో ఎన్నికలు ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే, ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కేటాయించేందుకు రెడీ అవుతుంది. దీంతో అభ్యర్థులు ఓటు వేయడం ఇష్టం లేని వాళ్ల కోసం ఈసీ నోటాను తీసుకొచ్చింది. అయితే, ఇప్పుడు అదే నోటా కోసం ప్రత్యేకంగా ఒక యూనిట్ ను సనత్ నగర్, నర్సంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నారు.
Read Also: Annavaram EO Transfer: అన్నవరం దేవస్థానం ఈవో ఆకస్మిక బదిలీ
అయితే, సనత్ నగర్ నియోజకవర్గంలో 18 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. నిన్న ( బుధవారం ) ఇద్దరు ఉపసంహరించుకున్నారు. ఇక, బరిలో 16 మంది ఉన్నారు. దీంతో ఒక బ్యాలెట్ యూనిట్ (16 గుర్తులు) అభ్యర్థులకు సరిపోతుండగా.. ఇక, నోటా కోసం రెండో బ్యాలెట్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నర్సంపేటలోనూ 16 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండటంతో ఇక్కడ సైతం నోటా కోసం అదనపు బ్యాలెట్ యూనిట్ ను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పాడింది.
Read Also: Sreeleela : అబ్బా.. ఇంత క్యూట్ గా చూస్తే కుర్రాళ్లు తట్టుకోలేరు పాప..
బాహుబలి ఈవీఎం.. ఒక్కో ఈవీఎంలో 16 గుర్తులకే అవకాశం ఉంటుంది. అంతకు మించితే మరో యూనిట్ ను దానికి జత చేస్తారు. ఐదేళ్ల క్రితం ఇలా గరిష్ఠంగా నాలుగు యూనిట్లతో 64 గుర్తుల వరకు ఎన్నిక నిర్వహించే అవకాశం ఉండేది. అంతకు మించితే కంట్రోల్ యూనిట్ తీసుకునేది కాదు.. కానీ.. 2019 నుంచి ప్రవేశ పెట్టిన ఎం-టీ రకం ఈవీఎంతో దీనికి ఓ పరిష్కారం దొరికింది. వీటిలో ఒక్కో కంట్రోల్ యూనిట్ కు.. 24 ఈవీఎం యూనిట్లను అమర్చేలా సాంకేతికతను డెవలప్ చేశారు. అంటే ఒక నియోజకవర్గంలో 384 మంది ఎన్నికల బరిలో ఉన్నా సరే.. ఈ ఈవీఎం యూనిట్లతో ఎన్నికల నిర్వహణ సాధ్యం అవుతుంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ లో 185 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఎం-టీ రకం ఈవీఎంలనే వినియోగించారు.