జేఎన్‌టీయూహెచ్ కొత్త వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ టి. కిషన్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ కె. విజయకుమార్ రెడ్డి (డైరెక్టర్), డాక్టర్ కె. వెంకటేశ్వరరావు (రిజిస్ట్రార్), వివిధ విభాగాల డైరెక్టర్లు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Anji Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ అంజిరెడ్డి ప్రచారంలో జోరు పెంచారు. గురువారం అంజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలది చాలా విలువైన పాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల తరుఫున పోరాటం చేసేందుకు అవకాశం కల్పించండని ఆయన కోరారు. ప్రభుత్వం…
Telangana : రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా, ఆయా వర్గాల విద్యార్థుల ప్రవేశాలకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల మినహాయింపు అందజేశారు. దివ్యాంగుల హక్కుల చట్ట నిబంధనల ప్రకారం, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఈ ఉత్తర్వులను విడుదల చేశారు. Kajal Aggarwal : సైలెంట్ గా సెట్ చేస్తున్న కాజల్ అగర్వాల్.. లైనప్ మాములుగా లేదు దివ్యాంగులను మొత్తం ఐదు…
Bhatti Vikramarka : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీబీనగర్ ఎస్సీ, బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆయన, మార్గమధ్యంలో ఈ పాఠశాల వద్ద ఆగి విద్యార్థుల సమస్యలు, సౌకర్యాలపై సమీక్ష చేశారు. ఈ సందర్బంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ తో కలిసి విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజన మెనూ, కాస్మోటిక్ ఛార్జీల నిధుల వినియోగం,…
TGTET Exam: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ పరీక్షలు నేటి నుండి ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 17 జిల్లాల్లో మొత్తం 92 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రోజుకు రెండు సెషన్లుగా పరీక్షలను నిర్వహిస్తున్నారు. టెట్‌కు రెండు పేపర్లకు కలిపి మొత్తం 2,75,773 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-I కు 94,335 మంది, పేపర్-IIకు 1,81,438 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.…
Seethakka In Assembly: తెలంగాణ శాసన మండలిలో గురుకుల పాఠశాలల్లో కలుషిత ఆహార సమస్యలపై జరిగిన చర్చలో మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని, హాస్టల్ సిబ్బందితో పాటు సరఫరాదారులపై కూడా నిఘాను పెంచుతామని ఆమె తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 70 సంఘటనలు నమోదయ్యాయని, అందులో 5024 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని మంత్రి సీతక్క గుర్తుచేశారు. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ పరిస్థితి…
CP CV Anand : తెలంగాణ ప్రభుత్వము గురుకులాలలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు, పొలిటికల్ లీడర్లు వసతి గృహాలను సందర్శించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలో హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్‌లింగంపల్లిలో ఉన్న మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ సందర్శించారు హైదరాబాద్ CP CV ఆనంద్. ఈ సందర్భంగా విద్యార్థులతో వారి సమస్యలు, వారికి ఉన్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇస్తున్న బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ విషయమై ప్రిన్సిపల్…
Hostels Checking : రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో పరిస్థితులను స్వయంగా అంచనా వేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి లతో సహా రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో పాటు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు గురుకుల, రెసిడెన్షియల్ హాస్టళ్లను రేపు శనివారం నాడు వ్యక్తిగతంగా సందర్శించినన్నారు. అక్కడే విద్యార్ధులతో కలసి భోజనం చేసి పరిస్థితులను అంచనా వేయనున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ…
Minister Seethakka : గత ప్రభుత్వం బాసర ట్రిపుల్ ఐటీని ట్రబుల్ ఐటీగా మార్చిందని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఇవాళ ఆమె నిర్మల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మసగ బారిన ట్రిపుల్ ఐటీ ప్రతిష్టను ఉన్నత స్థితికి తీసుకెళ్లుతామన్నారు. తక్షణ అవసరాల కోసం కోటి రూపాయల నిధులు కేటాయించామని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు పలు సమస్యలను అదృష్టం తీసుకొచ్చారని, వాటన్నింటినీ వీలైనంత తొందరగా పరిష్కరిస్తామన్నారు మంత్రి సీతక్క. ఫుడ్ కాంట్రాక్టర్ డ్రైనేజీ లాప్టాప్ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని,…
మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాల పై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సమావేశంలో ఏంజెపి గురుకుల సెక్రటరీ సైదులు , ఆర్సీవో లు, డిసిఓలు , ప్రిన్సిపల్లు పాల్గొన్నారు.