CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ పునర్నిర్మాణం వైపు ప్రజా ప్రభుత్వం బలమైన అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ట్వీట్టర్ వేదికగా ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు విడుదల చేసినట్టు తెలిపారు. ఈ ప్రక్రియను 15 సంవత్సరాల పాటు నిర్వహించకపోవడం నిజంగా షాకింగ్ అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ పాలనలో విద్య రంగం పట్ల చూపిన నిర్లక్ష్యం…
తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ రూపకల్పనకు సమగ్ర విధాన పత్రం రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విద్యా కమిషన్‌ను ఆదేశించారు. ఉత్తమ విద్యా వ్యవస్థ ఏర్పాటుకు ఎంత వ్యయమైనా వెనుకాడమని సీఎం తెలిపారు. క్షేత్ర స్థాయి పరిస్థితులకు అద్దం పట్టేలా విధానపత్రం ఉండాలని,అదే సమయంలో అది ఆచరణకు దూరంగా ఉండకుండా చూసుకోవాలని సీఎం హితవు పలికారు.ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోపాలు.. తీసుకురావల్సిన సంస్కరణలపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఐసీసీసీలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విద్యా రంగానికి…
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థ గురించి శాసన మండలిలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు దిగజారడానికి ప్రభుత్వమే కాకుండా, సమాజం కూడా జవాబుదారీగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యావ్యవస్థలో చేపట్టాల్సిన మార్పులు, తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఆయన వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం విద్యా కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.…
MLC Kavitha : తెలంగాణ శాసనమండలిలో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఎమ్మెల్సీ కవిత ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో విద్యావ్యవస్థ నాశనం అయిందని ప్రచారం చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ గణాంకాలే సమాధానమని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన గణాంకాల ప్రకారం, గత పది సంవత్సరాల్లో తెలంగాణలో విద్యా వ్యవస్థ మెరుగుపడింది. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ప్రైవేట్ పాఠశాలల సంఖ్య తగ్గిందని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయని…
Ponnam Prabhakar : తెలంగాణ శాసన మండలిలో విద్యా వ్యవస్థపై చర్చ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఫీల్డ్ లో పరిస్థితిని పరిశీలించినప్పుడు బాధ కలుగుతోందని, ప్రస్తుత విద్యా విధానంలో మార్పు చేసి మెరుగుదల తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం తీవ్ర సమస్యగా మారింది.…
Inter Exams : తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతుండగా, ప్రశ్నపత్రాల్లో తప్పుల పరంపర విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒక ప్రశ్నపత్రంలో తప్పులు ఉండటంతో, విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికే ఇంగ్లీష్, బోటనీ, మ్యాథ్స్ వంటి ముఖ్యమైన పేపర్లలో ప్రశ్నలలో తప్పులు బయటపడటంతో, ఇంటర్ బోర్డు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజునే ఇంగ్లీష్ ప్రశ్నపత్రంలో ఒక ప్రశ్నలో తప్పు ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఈ సమస్య…
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈరోజు ఇంటర్ ఫస్టియర్‌కు సంబంధించి బోటనీ, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్ష పేపర్లలో తప్పులు దొర్లాయి. బోటనీ, మ్యాథ్స్ పేపర్‌లలో చిన్నచిన్న తప్పులు జరిగినట్టుగా గుర్తించారు.
దేశ చరిత్రలోనే యంగ్ ఇండియా స్కూల్స్‌ను రూ.11,600 కోట్లతో మంజూరు చేస్తూ నిన్న జీవో జారీ చేశామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇలాంటి స్కూల్స్ ఈ దేశంలో ఎక్కడా లేవన్నారు. 20-25 ఎకరాల్లో అన్ని వసతులతో టీచింగ్ స్టాఫ్స్ కి కూడా అక్కడే వసతి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు..
సోమవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా ఇతర ఉన్నతాధికారులతో విద్యా సంస్కరణలపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. ఒకప్పుడు ప్రపంచానికి ప్రతిభావంతులను అందించిన ప్రభుత్వ స్కూళ్లు ఎందు వల్లనో ఇప్పుడా పరిస్థితిలో లేవని మంత్రి పేర్కొన్నారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ సభ్యులు కలిశారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను ప్రోత్సహించడానికి కావాల్సిన బడ్జెట్ను తయారు చేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందజేశారు. తెలంగాణ విద్యా కమిషన్ విద్యా రంగంలోని వివిధ వర్గాలతో వరుస చర్చలు జరిపి వారి నుండి అనేకమైన సలహాలు సూచనలు తీసుకున్నట్లు విద్యా కమిషన్ తెలిపింది.