Minister Harish Rao: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోఆరెకటిక సంఘం నూతన భవనానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ ఆసుత్రుల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ నెల 14 నుంచి గర్భిణీలకు ఆరోగ్యంగా, బలంగా ఉండటం కోసం కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. సొంత జాగ ఉన్నవారికి ఇండ్ల నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయ ఖాతా లో వేయబోతున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో 600 పింఛను ఇస్తున్నారని.. 2000 పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది ఏం లేదన్న మంత్రి…కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి శూన్యమని విమర్శలు గుప్పించారు.
Read Also: Agni Prime Ballistic Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం.. అగ్ని ప్రైమ్ మిస్సైల్ టెస్ట్ సక్సెస్..
ఇదిలా ఉండగా.. తెలంగాణ దశాబ్ధి వేడుకలను రాష్ట్ర సర్కారు ఘనంగా జరుపుతోంది. పదేళ్ల తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల గురించి ప్రజలకు వివరించడంతో పాటు వారికి అవసరమయ్యే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి 20 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. ఈ వేడుకల్లో భాగంగా నేడు ‘ఊరూరా చెరువుల పండుగ’ను నిర్వహిస్తున్నారు. డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టనున్నారు. గోరటి వెంకన్న రాసిన చెరువు పాటలు సహా చెరువుల మీద ఇతర కవులు రాసిన పాటలను వినిపిస్తారు. మత్స్యకారుల వలల ఊరేగింపులతో ఘనంగా నిర్వహిస్తారు. చెరువు కట్టలపై సభలు ఉంటాయి. నాయకులు, ప్రజలు కలిసి చెరువు కట్టమీద సహపంక్తి భోజనాలు చేస్తారు.
Read Also: Fraud At Registrar Office: అక్రమాలకు అడ్డాగా రిజిస్ట్రార్ కార్యాలయాలు
‘ఊరూరా చెరువుల పండుగ’ను పురస్కరించుకొని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. నాడు ఎండిపోయిన చెరువులు.. నేడు నిండుకుండల్లా మారాయని ఆయన అన్నారు. ఆనాటి పాలకుల నిర్లక్ష్యంతో గొలుసుకట్టు చెరువు వ్యవస్థ చిన్నాభిన్నమైందని.. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువుల పునరుజ్జీవం జరుగుతోందన్నారు. అందుకే మన మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శమని మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. అమృత్ సరోవర్‌గా దేశవ్యాప్తంగా అమలవుతోందన్నారు. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందని ఆయన ట్విటర్ వేదికగా చెరువు పునర్వైభవాన్ని మంత్రి వీడియోను పోస్ట్ చేశారు.