Kishan Reddy: తెలంగాణలో ఉన్న మత పరమైన రిజర్వేషన్లు తీసేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: తెలంగాణలో ఉన్న మత పరమైన రిజర్వేషన్లు తీసేయాలని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. అప్పుడే గిరిజనులకు పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు అందుతాయని అన్నారు. తెలంగాణలో పదవులు ద్రోహులకు ఇస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దళిత సీఎం, మూడెకరాల భూమి ఎక్కడ పోయింది? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎగరవేశారు. ఫ్లై ఓవర్ లతో సమస్యలు పరిష్కారం కావన్నారు. ప్రజలకు అనుమతి లేని సెక్రటేరియట్ ఎందుకు? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కేంద్రం చాలా నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉందన్నారు.
Read also: Telangana Formation Day Celebrations: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. ముస్తాబైన గ్రేటర్
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
తెలంగాణ రాష్ట్ర సాధన కొసం అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఉద్యమాలు చేసిన అందరికీ కేంద్ర ప్రభుత్వం తరుపున శుభాకాంక్షలు తెలిపారు. నీళ్లు , నిధులు , నియామకాలు కోసం ఉద్యమం జరిగిందన్నారు. ఆదిలాబాద్ నుంచి పాలమూరు వరకు అన్ని ప్రాంతాలు రాష్ట్రం కోసం పోరాటం చేశారన్నారు. 1200 మంది అమర వీరులు అయ్యారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్ ను స్మరించు కోవాలని, ఆమె రాష్ట్రం కోసం పార్లమెంటు లో పోరాటం చేశారని అన్నారు. ఏ వ్యక్తి వల్లనో, కుటుంబం వల్లనో తెలంగాణ రాలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు తెలంగాణ ఒక కుటుంబానికి బానిస అయిందని అన్నారు. అవినీతి విపరీతంగా పెరిగి పోయిందని మండిపడ్డారు. దగా పడ్డ తెలంగాణగా మారిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేకచోట్ల మోసం జరుగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. ల్యాండ్ మాఫియా, ధరణి మాఫియా లాంటి వాటితో పాటు అన్ని చోట్ల మాఫియా గా మారిందని ఆరోపణలు గుప్పించారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!