Telangana Decade Celebrations: తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం.. 21 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు.. ఇక, ఉత్సవాలపై సమీక్ష నిర్వహించిన సీఎం కె.చంద్రశేఖర్ రావు.. ఏ రోజు ఏ కార్యక్రమం ఉండాలి అనే విషయాన్ని ఖరారు చేశారు.. ఆ తర్వాత దశాబ్ధి ఉత్సవాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు.
ఇక, జూన్ 3 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఉత్సవాలకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..
* జూన్ 3 శనివారం నాడు తెలంగాణ రైతు దినోత్సవం
* జూన్ 4వ తేదీ ఆదివారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘‘సురక్షా దినోత్సవం’’
* జూన్ 5వ తేదీ సోమవారం నాడు ‘‘తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం’’
* జూన్ 6వ తేదీ మంగళవారం ‘‘తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం’’
* జూన్ 7వ తేదీ బుధవారం ‘‘సాగునీటి దినోత్సవం’’
* జూన్ 8వ తేదీ గురువారం ‘‘ఊరూరా చెరువుల పండుగ’’
* జూన్ 9 శుక్రవారం రోజున ‘‘తెలంగాణ సంక్షేమ సంబురాలు’’
* జూన్ 10వ తేదీ, శనివారం ‘‘తెలంగాణ సుపరిపాలన దినోత్సవం’’
* జూన్ 11వ తేదీ, ఆదివారం నాడు ‘‘తెలంగాణ సాహిత్య దినోత్సవం’’
* జూన్ 12వ తేదీ సోమవారం ‘‘తెలంగాణ రన్’’
* జూన్ 13 మంగళవారం ‘‘తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం’’
* జూన్ 14వ తేదీ బుధవారం ‘‘తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవము
* జూన్ 15 గురువారం ‘‘తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం’’
* జూన్ 16వ తేదీ శుక్రవారం ‘‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం’
* జూన్ 17వ తేదీ శనివారం ‘‘తెలంగాణ గిరిజనోత్సవం’’
* జూన్ 18వ తేదీన ఆదివారంనాడు ‘‘తెలంగాణ మంచి నీళ్ల పండుగ’’
* జూన్ 19వ తేదీ సోమవారం ‘‘తెలంగాణ హరితోత్సవం’’
* జూన్ 20వ తేదీ మంగళవారం ‘‘తెలంగాణ విద్యాదినోత్సవం’’
* జూన్ 21వ తేదీ బుధవారం ‘‘ తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’’
* జూన్ 22వ తేదీ గురువారం ‘‘అమరుల సంస్మరణ’’ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించారు.