భక్తి, ఎన్టీవీ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు ఎన్టీఆర్ స్టేడియం అపూర్వమైన ఆధ్యాత్మిక కాంతులతో మిన్నంటింది. ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణం శివభక్తి జ్యోతులతో నిండిపోగా, భక్తి, ఆరాధనలతో నిండిన ఆ వాతావరణం ప్రతి భక్తుడి మనసును మైమరిపించింది. కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీలు ప్రతీ ఏటా నిర్వహించే ఈ మహోత్సవం, ఈసారి మరింత వైభవంగా, మహిమాన్వితంగా సాగుతోంది. ఈ…
హైదరాబాద్ గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది. అన్ని జిల్లాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజించడం, ప్రకృతిని ఆరాధించడం ద్వారా మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ, తెలంగాణ సంస్కృతి మరియు సాంప్రదాయాలకు ప్రత్యేక స్థానం కలిగిందని సీఎం రేవంత్ చెప్పారు. సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూ, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకగా బతుకమ్మను ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ సామూహిక జీవన విధానం, కష్టసుఖాలను పంచుకునే ప్రజల…
Kaloji: తెలంగాణ కోసం, ఇక్కడి ప్రజల హక్కుల కోసం పోరాడిన మహావ్యక్తి ప్రజాకవి కాళోజీ నారాయణరావు. పుట్టుక, చావు తప్ప బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు కాళోజి. తన భావాలను తెలంగాణ యాసలో.. సులభంగా అర్ధమయ్యే భాషలో చెప్పేవారు. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి.. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి.. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని గర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి. తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతి అయిన సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా…
Ponnam Prabhakar : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మంత్రివర్గం ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. జూలై 26నుంచి ప్రారంభం కానున్న బోనాల పండుగను పురస్కరించుకొని, రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఉత్సవాలకు సంబంధించి అన్ని విభాగాలతో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆషాఢ మాస బోనాల పండుగను అన్ని రాజకీయాలకు అతీతంగా, అన్ని శాఖల…
త్వరలో బోనాల పండుగ రానుంది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గుడి కమిటీ సభ్యులకు కీలక సూచనలు చేశారు. బోనాలు ఉత్సవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్క గుడి కమిటీ మెంబర్స్ గుడి బయట ఒక బ్యానర్ పెట్టాలని కోరారు. "మద్యం తాగి మా గుడి లోపట రావద్దు" అని అందులో రాయాలన్నారు.
తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత వైభవంగా, ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే పాతబస్తీ లాల్ దర్వాజ మహాంకాళి బోనాల జాతర ఉత్సవాలు జులై 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సంవత్సరం 117వ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
Miss World 2025: మిస్ వరల్డ్ వేదికపై మరోసారి తెలంగాణ సంసృతీ, సంప్రదాయాలు తళుక్కున మెరిసాయి. ఇవాళ జరిగిన వరల్డ్ ఫ్యాషన్ ఫినాలే షోలో పోటీదారులు అందరూ తెలంగాణకు ప్రత్యేకమైన పోచంపల్లి, గద్వాల్ చీరలు ధరించి ర్యాంపుపై వాక్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అంతర్జాతీయ ఖ్యాతి పొందిన పోచంపల్లి హ్యాండ్లూమ్ వస్త్రాలతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మెరిశారు. వందకు పైగా దేశాల ప్రతినిధులు చీరకట్టులో సంప్రదాయబద్దంగా కనిపించారు. అమెరికా కరె్బియన్ దేశాలకు చెందిన సుందరీమణులు…
Miss World 2025: 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన “హెడ్-టు-హెడ్ చాలెంజ్” ఫినాలే సందర్భంగా.. వివిధ ఖండాల నుంచి వచ్చిన అందాల కిరీటధారులు తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యంగా హైదరాబాద్‌ను అభినందనలతో ముంచెత్తారు. ఈ పోటీ సందర్భంగా జడ్జీలు అడిగిన ప్రశ్నలకు తెలంగాణ సంస్కృతి, అభివృద్ధి, మహిళల సాధికారత, భద్రతకు సంబంధించి కంటెస్టెంట్స్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. తెలంగాణ రాష్ట్రం మహిళల భద్రతను హక్కుగా గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటుందన్న విషయాన్ని…
Miss World 2025: వరంగల్ జిల్లా నేడు ప్రపంచ అందాల భామలతో కళకళలాడింది. మిస్ వరల్డ్ పోటీదారుల రెండు బృందాలు జిల్లాలో పర్యటించాయి. మొదటి బృందంలో 22 మంది, రెండవ బృందంలో 35 మంది సుందరీమణులు ఉన్నారు. మొదటి బృందానికి చెందిన 22 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ తొలుత చారిత్రాత్మక వేయి స్తంభాల ఆలయాన్ని సందర్శించి, అనంతరం ఖిలా వరంగల్ కోట యొక్క వైభవాన్ని తిలకించారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ఈ బృందం…