Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు నేడు (మే 14) ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. సుందరీమణుల రాక సందర్భంగా అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు పూర్తి చేసారు. వివిధ దేశాలకు చెందిన సుందరీమణులకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బతుకమ్మ, సంగీత వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికే ఏర్పాట్లు చేసారు అధికారులు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి రెండు బృందాలుగా ప్రత్యేక బస్సుల్లో వరంగల్ జిల్లాకు మిస్ వరల్డ్ కంటెస్టెంట్…
Miss World 2025 : ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలకు హోస్టింగ్ చేసే అరుదైన గౌరవాన్ని పొందిన హైదరాబాద్ ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే 51 దేశాలకు చెందిన అందాల ప్రదినిధులు నగరానికి చేరుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల కంటెస్టెంట్లు ఎయిర్ పోర్టులో అడుగుపెడుతున్న నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. వచ్చిన ప్రతి కంటెస్టెంట్‌కు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా…
హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్‌లో గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డ్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్ రాజు, సీనియర్ నటి జయసుధ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఏర్పాటు చేసుకున్న అవార్డులని.. దశాబ్ద కాలంగా పరిశ్రమ ఎలాంటి ప్రోత్సాహకాలకు, అవార్డులకు నోచుకోలేదన్నారు.
భక్తి, కళ, నైపుణ్యానికి మేళవింపు అంటే సిరిసిల్ల చేనేతకారుల గొప్పతనం గుర్తుకు వస్తుంది. ఆ సంప్రదాయాన్ని మరోసారి ప్రపంచానికి గుర్తు చేస్తూ, శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల సీతారాముల కల్యాణానికి ఒక అరుదైన పట్టు చీరను రూపొందించి ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు సిరిసిల్ల నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్. ఈ చీరకు ప్రత్యేకత ఏమిటంటే – ఇది కేవలం పట్టు చీర మాత్రమే కాదు, ఇది భక్తి రూపంలో ఓ కళాత్మక కానుక. సీతమ్మకు అర్పించే ఈ బంగారు…
Strange Tradition : హోలీ పండుగ అంటే రంగుల, ఆనందోత్సాహాల సంబరాలు. అయితే, తెలంగాణలోని కొన్ని గ్రామాల్లో హోలీ వేడుకలు ప్రత్యేకమైన సంప్రదాయాలతో జరుపుకుంటారు. అందులో ఓ వింత ఆచారం నిజామాబాద్ జిల్లా హున్సా గ్రామంలో ఉంది. హనుమాన్ ఆలయం వద్ద ప్రతి ఏటా హోలీ పండుగ సందర్భంగా గ్రామస్థులు పరస్పరంగా పిడిగుద్దులాటలో పాల్గొంటారు. ఈ ఆచారాన్ని కొనసాగించేందుకు పోలీసులు కూడా షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. వృథా గొడవలు లేకుండా నియంత్రణలో ఉంచేందుకు, పిడిగుద్దులాటను కేవలం…
TPCC Mahesh Goud : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తన పరిధిని దాటిన ప్రవర్తనతో తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కేసీఆర్ కౌశిక్‌రెడ్డిని అదుపులో ఉంచాలని సూచించారు. కొంపల్లి దేవరయాంజాల్‌లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో మహేశ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేపై దాడి చేయడం తగదని స్పష్టంచేశారు. దాడులు, దురుసుగా ప్రవర్తించడం తెలంగాణ సంస్కృతి కాదని,…
Srinivas Goud : తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరస్కరించడంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. దేవుడి దగ్గర ప్రాంతీయ వివక్షలు మంచివి కావని, తెలంగాణ ఆలయాల్లో అందరినీ సమానంగా చూసే విధానాన్ని గుర్తుచేశారు. తిరుమలలో కూడా ఇదే నిబద్ధత ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం గద్వాల నియోజకవర్గంలోని జములమ్మ అమ్మవారిని శ్రీనివాస్ గౌడ్ కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం గద్వాల బీఆర్‌ఎస్ నాయకుడు బాసు హనుమంత నాయుడు…
తెలంగాణలో కులమత సంప్రదాయాలు పక్కదారి పడుతున్నాయని.. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతతో పాటు యోగాసనాలు ఫాలో అవ్వాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో క్రిస్‌మస్ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. అధిక సంఖ్యలో క్రిస్టియన్ సోదరి, సోదరిమణులు పాల్గొన్నారు.
MLC Kavitha : మన సంస్కృతిపై దాడి జరుగుతుంటే ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ తల్లిపై ప్రేమ లేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి రూపం మార్చారని విమర్శించారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్లుంటుందన్నారు. అందరం కలిస్తేనే ఒక అందమైన బతుకమ్మ అవుతుంది… అందరం కలిస్తేనే అందమైన సమాజం అవుతుందన్న సందేశం ఇచ్చేది బతుకమ్మ అంటూ కవి పేర్కొన్నారు. అలాంటి…
రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది