త్వరలో బోనాల పండుగ రానుంది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గుడి కమిటీ సభ్యులకు కీలక సూచనలు చేశారు. బోనాలు ఉత్సవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్క గుడి కమిటీ మెంబర్స్ గుడి బయట ఒక బ్యానర్ పెట్టాలని కోరారు. “మద్యం తాగి మా గుడి లోపట రావద్దు” అని అందులో రాయాలన్నారు.
READ MORE: Chevireddy Bhaskar Reddy: నా అరెస్ట్ అక్రమం.. నోటీసు కూడా ఇవ్వలేదు..
ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. “ప్రతి ఒక్క గుడి దగ్గర ఒక బ్యానర్ పెట్టాలి. బోనాలు అంటే ఆడే బోనాలు కాదు. ఇవాళ మనం చేస్తున్నాం.. 18,19,20 ఏళ్ల పిల్లల దృష్టిలో బోనాలు అంటే తాగాలే.. ఆడాలే.. డ్యాన్స్ చేయాలే అని వాళ్ల మైండ్‌లో ఫిక్స్ అయింది. దేశ సేవకు ఎప్పుడైనా యువకుల అవసరం పడితే.. గన్ పట్టుకోరా అంటే చేతకాకుండా అవుతుంది. మీ ఫ్యామిలీని కూడా రక్షించుకోలేరు. ప్రస్తుతం అలాంటి పిల్లలు తయారవుతున్నారు. అందుకే.. ఎవరైనా తాగి వస్తే గుడిలోపలికి ఎంట్రీ లేదు అని బ్యానర్ పెట్టాలి. సమాజాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉంది. బోనాలు అంటే మంచిగా వర్షం పడాలి.. పంటలు బాగా పండాలి.. ఎలాంటి రోగాలు వ్యాపించవద్దు అని అమ్మవారికి మనం మొక్కుతాం. ఈ విషయం ఎవరికి తెలియదు. ప్రస్తుతం ఉన్న యువతకు బోనాలు ఎందుకు చేస్తారు? అని అడగండి.. బోనాలు అంటే.. మద్యం, డ్యాన్స్, డీజే అని చెబుతారు. ఇప్పుడు ఉన్న పిల్లలకే ఇది అలవాటు అయితే.. వారికి పుట్టే పిల్లల పరిస్థితి ఏంటి? అందుకే మనందరిపై బాధ్యత ఉంది. సమాజాన్ని , సంస్కృతి కాపాడుకోవాలి. అందుకోసం ఒక్కోక్క బ్యానర్ పెట్టాలి.” అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.