సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య కొడుకుపై కక్ష పెంచుకున్న రెండో భర్త అతడిని అతి దారుణంగా కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనం రేపుతోంది.
వివరాలలోకి వెళితే.. సంగారెడ్డి జిల్లాకు చెందిన అరుణ అనే మహిళ భర్త ఏడాది క్రితం మృతి చెందాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు. గద్వాల్ లోని ఓ కంపనీలో పని చేస్తూ ఆమె పిల్లలను చదివిస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే అదే కంపెనీలో పనిచేసే వినయ్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీయడంతో తోడుగా ఉంటాడని వినయ్ ని పెళ్లి చేసుకుంది అరుణ. పెళ్ళైన దగ్గరినుంచి వినయ్ కి, అరుణ పిల్లలు అంటే పడేది కాదు. ముఖ్యంగా ఆమె మూడో కుమారుడు అరుణ్ అంటే వినయ్ కి కోపం.. దీంతో రోజు బాలుడిని చితకబాది చిత్రహింసలను పెట్టేవాడు. ఇలా చేస్తే తాను, పిల్లలు ఇంట్లోంచి వెళ్లిపోతామని అరుణ భర్తను బెదిరించింది. అయినా వినయ్ లో మార్పు రాకపోను అరుణ్ పై పగ పెరిగింది. ఇక ఈరోజు కూడా భార్య ఉద్యోగానికి వెళ్లడంతో మరోసారి అరుణ్ పై వినయ్ చేయి చేసుకున్నాడు.
ఇష్టం వచ్చినట్లు బాలుడిని కొట్టడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో భార్య అరుణ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.