Police Arrested 7 Members In Cheryala ZPTC Mallesham Case: సోమవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన చేర్యాల ZPTC మల్లేశంను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. లేటెస్ట్‌గా ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఏడుగురు అనుమానుతుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల గుజ్జకుంట గ్రామంలో ఓ భూ పంచాయతీ చేసి తీసుకున్న నిర్ణయమే మల్లేశం పాలిట శాపంగా మారిందని పోలీసులు తేల్చారు. ఆ భూ పంచాయతీ జరిగినప్పటి నుంచే ప్రత్యర్థులు మల్లేశంపై పగ పెంచుకున్నారని గ్రామస్థులు చెప్తున్నారు. మల్లేశం హత్య వెనుక గుజ్జకుంట ఉప సర్పంచ్ సత్తయ్య, శ్రీను హస్తం ఉండొచ్చని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మల్లేశం హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. గ్రామంలో పోలీసులు మోహరించారు.
Akash Chopra: మయాంక్‌ను కెప్టెన్ చేయొద్దు.. చేస్తే తప్పదు భారీ మూల్యం
మరోవైపు.. మల్లేశంను చంపేందుకు అర్థరాత్రి నుంచే ప్రత్యర్థులు ప్లాన్ వేసినట్టు పోలీసులు పసిగట్టారు. ప్రతిరోజూ మల్లేశం వాకింగ్‌కి వెళ్లాడన్న సంగతి తెలిసిన ప్రత్యర్థి.. ఆ సమయంలో ఆయన్ను అంతమొందించేలా పక్కా ప్లాన్ వేసుకున్నట్టు తెలుస్తోంది. హత్య చేసిన ప్రాంతం సమీపంలోనే దుండగులు రాత్రి నుంచి మద్యపానం సేవించినట్టు.. అక్కడ పడున్న బాటిళ్లను చూసి తేల్చారు. ఇక ఉదయం మల్లేశం వాకింగ్ చేసుకుంటూ ఆ ప్రాంతం దగ్గరకు చేరుకోగా.. దుండగులు ఒక్కసారిగా ఆయనపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న మల్లేశంను స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో ఉన్న మల్లేశంనను తొలుత సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే.. తీవ్ర రక్తస్రావం కావడంతో అప్పటికే మల్లేశం మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
Avatar 2: ఈ విజువల్ వండర్ ఇప్పటివరకూ 7000 కోట్లు రాబట్టింది… అయినా సరిపోదు