Lovers Crime News: మూడేళ్ల క్రితమే యువతికి పెళ్లి.. ప్రియుడి కోసం ఆ పని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadagirigutta Lovers Commits Suicide On Railway Tracks: ఆ యువతికి మూడేళ్ల క్రితమే పెళ్లయినా.. పెళ్లి కాకముందే ప్రేమించిన యువకుడిని విడిచి ఉండలేక, అతనితో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. వాళ్లిద్దరు కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేట సమీపంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. భువనగిరి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన నలంద (23) అనే అమ్మాయికి మూడేళ్ల క్రితం యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన యాదగిరితో వివాహం జరిగింది. యాదగిరిగుట్ట దేవస్థానంలోని లడ్డు తయారీ విభాగంలో యాదగిరి ఉద్యోగం చేస్తున్నాడు.
ఎప్పట్లాగే యాదగిరి తన విధులు ముగించుకొని.. మంగళవారం రాత్రి ఇంటికి వెళ్లాడు. అయితే.. ఇంటికి వెళ్లి చూసేసరికి భార్య నలంద కనిపించలేదు. ఆమె కోసం గాలించగా.. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. దీంతో యాదగిరి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కట్ చేస్తే.. ఈరోజు (బుధవారం) బహుపేట బహుపేట పరిధిలోని రైల్వే ట్రాక్ వద్ద రెండు మృతదేహాలు సిబ్బందికి కనిపించాయి. ఈ విషయాన్ని వాళ్లు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. యాదగిరిగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. ఆ రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఎవరని ఆరా తీయగా.. నలంద, గణేశ్‌లుగా పోలీసులు గుర్తించారు.
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
విచారణలో భాగంగా.. మూడేళ్ల క్రితం పెళ్లి అవ్వడానికి ముందే నలందకు గణేశ్‌తో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తేలింది. కుటుంబ సభ్యులు బలవంతంగా పెళ్లి చేయడంతో, ఎదురించే ధైర్యం యాదిగిరిని నలంద వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇటు నలంద, అటు గణేశ్ ఒకరినొకరు విడిచి ఉండలేక.. ఇలా బలవన్మరణానికి పాల్పడినట్లు వెల్లడైంది. వారిద్దరి మరణాలతో.. ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!