జీడిమెట్ల అంజలి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రేమ వ్యవహారానికి పదే పదే అడ్డొస్తుందన్న కారణంతోనే అంజలిని.. కూతురు హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో కుమార్తె సహా ఆమెకు సహకరించిన శివ, అతని తమ్ముడు యశ్వంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే మర్డర్ చేశారని పోలీసులు చెబుతున్నారు.
READ MORE: CM Chandrababu: ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీఆర్ సీఎం అయ్యారు..
జీడిమెట్లలో పదో తరగతి చదువుతున్న అంజలి పెద్ద కూతురుకు.. డీజే ఆపరేటర్ శివతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. కానీ ఈ ప్రేమను బాలిక తల్లి ఒప్పుకోలేదు. పైగా ప్రేమాయణం వద్దని పదే పదే మందలించింది. దీన్ని తట్టుకోలేని బాలిక, ప్రియుడు శివ, అతడి మైనర్ తమ్ముడితో కలిసి తల్లి హత్యకు కుట్ర పన్నింది. తల్లి.. తమ ప్రేమకు అడొస్తుందని భావించి ఈ హత్యకు పాల్పడినట్లు నిందితురాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడించింది..
READ MORE: UP: పొలంలో రహస్యంగా కలిసిన ప్రేమికులను రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న గ్రామస్థులు.. కట్‌చేస్తే..
బాలిక.. ఈ నెల 19న ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తిరిగి రాకపోవడంతో జీడిమెట్ల పోలీసులకు తల్లి అంజలి ఫిర్యాదు చేసింది. మరునాడు రాత్రి ఇంటికి తిరిగొచ్చిన బాలికతో తల్లికి గొడవైంది. అయితే తెల్లవారి తల్లి పూజలో ఉన్న సమయంలోనే నిందితులు హత్యకు పాల్పడ్డారు. చున్నీతో గొంతు నులిమి, తలపై బలంగా కొట్టి అంజలిని హత్య చేశారు. పైగా హత్య అనంతరం నిందితురాలు ఈ దుర్మార్గాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసుల అనుమానంతో విచారణ లోతుగా కొనసాగించగా, బాలిక వాస్తవాలు ఒప్పుకుంది. దీంతో ముగ్గురు నిందితులపై IPC 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
READ MORE: Honeymoon Murder Case: హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం.. పిస్టల్ స్వాధీనం..
కుమారుడు చేసిన పనిని సమర్థించుకున్న శివ తల్లి
మరోవైపు తన కుమారుడు చేసిన పనిని శివ తల్లి సమర్థించుకుంది. బాలిక తల్లిని చంపడం కరేక్టేనని తెలిపింది. అసలు వ్యవహారం అంతా బాలిక దగ్గరే ఉందన్న ఆమె.. అసలు ఆ అమ్మాయి బయటకు ఎందుకు వెళ్లిందనే దానిపై స్పష్టత రావాలని చెప్పింది.. కానీ ఈ ఘటన పెరుగుతున్న సోషల్ మీడియా ప్రభావం, మైనర్ల మానసిక పరిపక్వత లోపం, తల్లిదండ్రులతో బంధాల్లో తలెత్తే విభేదాలు ఏ స్థాయికి తీసుకెళ్తాయో మరోసారి తేటతెల్లం చేసింది. పోలీసులు, మానసిక నిపుణులు, సామాజిక సంస్థలు కలసి ఈ విషయాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది.