CM KCR Meets LaluPrasad Yadav: లాలూప్రసాద్ యాదవ్ తో కేసీఆర్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో సుదీర్ఘ భేటీ అనంతరం బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నివాసానికి చేరుకున్నారు సీఎం కేసీఆర్. తేజస్వీ యాదవ్ తండ్రి….మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను పలకరించి ఆయన ఆరోగ్యం, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్. లాలూ నివాసంలో ఆయనతో కలిసి తేనీరు సేవించారు. సమకాలీన రాజకీయ అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యుల్ని కేసీఆర్ పలకరించారు. గతంలో అనారోగ్యంతో బాధపడుతోన్న లాలూ ప్రసాద్ యాదవ్ తన ఇంట్లో జారిపడి పడటంతో ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఆయన కోలుకున్నారు. తేజస్వితో కలిసి సీఎం కేసీఆర్ లాలూని కలిశారు.
Read Also: CM Jagan: కడప జిల్లాలో మూడు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..!!
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
అంతకుముందు బీజేపీ ముక్త్ భారత్ కోసం విపక్షాలు కలిసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చామన్నారు సీఎం కేసీఆర్. బీజేపీ పాలనలో దేశం తీవ్రంగా నష్టపోయిందని, అందుకే దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని, ఈ విషయం గురించి నితీశ్‌తో కూడా చర్చించామని చెప్పారు. దేశానికి రొటీన్ ప్రభుత్వాలు వద్దని, భారత్‌ను మార్చే ప్రభుత్వం రావాలని చెప్పారు. బీజేపీ కేవలం అబద్ధాలతోనే పాలన సాగిస్తోందని విమర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో విపక్షాలను ఏకం చేసే విషయమై నితీశ్‌తో చర్చించినట్లు కేసీఆర్ తెలిపారు.

కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలను బలహీనరపరిచేందుకు దర్యాప్తు సంస్థల్ని వాడుకుంటోందని కేంద్రంపై మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని నరేంద్ర మోదీ సర్కారు ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై దాడులకు తెగబడుతోందని ఆయన విమర్శించారు. శాంతిభద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమని కేసీఆర్ చెప్పుకొచ్చారు. సీబీఐ ప్రవేశాన్ని నిరాకరిస్తూ బీహార్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్న కేసీఆర్.. మిగిలిన అన్ని రాష్ట్రాలు ఇదే పని చేయాలని పిలుపునిచ్చారు.
Read Also: Kadiam Constable: ఆమెతో కానిస్టేబుల్ రాసలీలలు.. నడిరోడ్డుపై నగ్నంగా
తాజావార్తలు
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
-
OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
-
Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!