తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ కేబినేట్ సమావేశం.. ప్రగతి భవన్ లో జరుగుతోంది. అయితే.. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. వరి ధాన్యం కొనుగోలు పై ముఖ్యంగా చర్చ జరుగనున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే…. యాసంగి లో వరి సాగు, కొత్త వరైటీ , ప్రత్యామ్నాయ పంటల పై కూడా చర్చ జరుగనున్నట్లు…
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్‌ను ఎమ్మెల్సీని చేయడంతో కేబినెట్‌లో మార్పులు చేర్పులపై ఒక్కసారిగా చర్చ మొదలైంది. కేబినెట్‌లో చోటు కల్పించడానికే ఆయన్ను మండలికి తీసుకొచ్చారని సమాచారం. బండ ప్రకాశ్‌తోపాటు మరికొందరిని కేబినెట్లోకి తీసుకోవడం..ఇంకొందరిని డ్రాప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కేబినెట్‌లోకి తీసుకొనేందుకే బండ ప్రకాశ్‌కు ఎమ్మెల్సీ? గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్. తొలి కేబినెట్‌లో ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను బర్తరఫ్ చేసి ఆ స్థానంలో కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎంను…
తెలంగాణలో చార్జీల పెంపుపై కసరత్తు చేస్తున్న విద్యుత్ అధికారులు ప్రజలపై భారం పడకుండా లాభం పొందడానికి గల మార్గాలను అన్వేషిష్తున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా పెంచని ప్రాథమిక చార్జీల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. LT 1-A కేటగిరీలో 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తే యూనిట్‌కు రూపాయి 45 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. మొదటి నుంచి ఈ చార్జీల్లో మార్పు లేదు. ఈ సారి స్వల్పంగా పెంచి దానిని రూపాయిన్నరగా రౌండ్ ఫిగర్ చేసే అవకాశాలున్నాయి.…
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం జరిగాఇంది.. మధ్యాహ్నం రెండున్నరకు ప్రారంభమైన కేబినెట్ సమావేశం దాదాపు ఆరుగంటల పాటు సాగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నది. మొదటగా రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై కేబినెట్ లో చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో కేబినెట్ ఆరా తీసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులు, తీసుకుంటున్న చర్యలపై వైద్యాధికారులు కేబినెట్ కు సమాచారం అందించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలల్లో…
హుజురాబాద్ ఉప ఎన్నికలు జరగనున్న తరుణంలో.. కాంగ్రెస్ పార్టీని వీడి.. అధికార టీఆర్ఎస్‌లో చేరారు పాడి కౌశిక్ రెడ్డి.. ఆ తర్వాత గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని శాసన మండలికి పంపనున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్.. దీనిపై నిర్ణయం తీసుకున్న తెలంగాణ కేబినెట్.. గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం ఆ ఫైల్‌ను రాజ్‌భవన్‌కు కూడా పంపించారు. అయితే, గవర్నర్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డి పేరును ఎమ్మెల్సీగా ప్రభుత్వం సిఫార్సు చేయడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ప్రభుత్వంపై…
వ్యవసాయం పై ఈరోజు తెలంగాణ కేబినెట్ లో చర్చించారు. వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర వ్యవసాయ అంశాల పై… పత్తిసాగు పై ప్రత్యేకంగా చర్చించింది. తెలంగాణ పత్తికి ఉన్న ప్రత్యేక డిమాండ్ వల్ల సాగును ఇంకా పెంచాలని, అందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తపరచాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించింది. ఇక రుణ మాఫీ పై కేబినెట్ లో చర్చిస్తూ… రాష్ట్రంలో ఇప్పటివరకు పంట రుణ మాఫీకి సంబంధించిన వివరాలను కేబినెట్…
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.. కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారంగా అన్ని రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల వారీగా జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది కేబినెట్.. సమాజంలో, ఉద్యోగ రంగాల్లో చోటుచేసుకుంటున్న అధునాతన మార్పులకు అనుగుణంగా, వినూత్న రీతిలో ఉద్యోగాల కల్పన అవసరమని.. అందుకు సరికొత్త పోస్టుల అవసరం…
కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ ను పూర్తిగా ఎత్తివేసింది తెలంగాణ ప్రభుత్వం.. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.. రాష్ట్రంలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్, తదితర అంశాలపై చర్చించిన కేబినెట్.. లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయానికి వచ్చింది.. కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చినట్టు కేబినెట్ పేర్కొంది.. అన్ని రకాల నిబంధనలు పూర్తిగా ఎత్తివేసింది.. కరోనా కేసులు, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని.. వైద్యారోగ్యశాఖ నివేదిక పరిశీలించిన…