CM Revanth Reddy : ఎస్సీ వర్గీకరణ అమలు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
- ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ
- ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
- సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తాం
- సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన రోజే.. నేను సభలో ప్రకటన చేశా :సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ కులాల ఉప వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు కంటే ముందుగా తెలంగాణలో వర్గీకరణ అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం దేశంలో అనేక పోరాటాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేయడంలో కట్టుబడినట్లు తెలిపారు. ఈ విధంగా, ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం తనకు అత్యంత సంతృప్తినిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు.
దళితుల అభ్యున్నతికి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద మద్ధతు ఇచ్చిందని, దళితులకు ఉన్నత పదవులు , అవకాశాలను కల్పించేందుకు ఎప్పటికీ పాటుపడిందని చెప్పారు. ముందుగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని అసెంబ్లీకి ప్రవేశ పెట్టారు. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని, సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన రోజే.. నేను సభలో ప్రకటన చేశా అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్!
- Off The Record: ఒకే పార్టీకి రెండు ఆఫీసులా..? అక్కడ బీజేపీలో పీక్స్‌కు చేరిన గ్రూప్ వార్..!
Hema Malini: ‘‘30 మంది మరణించడం పెద్ద విషయం కాదా..?’’ హేమామాలిని షాకింగ్ కామెంట్స్..
మూడు గ్రూపులుగా ఎస్సీలను వర్గీకరించాలని కమిషన్‌కు రెఫర్ చేసినట్లు పేర్కొన్నారు. ఎస్సీల్లో మొత్తం 59 ఉపకులాలను వర్గీకరణ కమిషన్ గుర్తించిందని చెప్పారు. ఎస్సీ కులాలను గ్రూప్ -1, 2, 3గా వర్గీకరించాలని సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు. గ్రూప్-1లోని 15 ఉపకులాలను ఒకశాతం రిజర్వేషన్‌కు సిఫారసు చేసిందన్నారు.
గ్రూప్-1లోని 15 ఉపకులాల జనాభా 3.288శాతంగా ఉండగా.. గ్రూప్-2లోని 18 ఎస్సీ ఉప కులాలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ల కోసం సిఫారసు చేశామన్నారు. గ్రూప్-2లోని 18 ఎస్సీ ఉప కులాల జనాభా 62.748 శాతంగా ఉన్నారని.. గ్రూప్-3లోని ఎస్సీ ఉపకులాలకు 5శాతం రిజర్వేషన్లకు సిఫారసు చేసినట్లు చెప్పారు. ఈ గ్రూప్-3లోని 26 ఉప కులాల జనాభా 33.963శాతంగా ఉన్నట్లు సీఎం వివరించారు. అంతకు ముందు ఇక ఎస్సీ వర్గీకరణకు శాసనమండలి ఆమోదం తెలిపింది. వర్గీకరణకు ఆమోదం అనంతరం శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది.
Satya Kumar Yadav: క్యాన్సర్‌తో చాలా మంది చనిపోతున్నారు.. సరైన అవగాహన కల్పించాలి!
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!