ఉస్మానియాలో మేము, ఇక్కడ మీరు ఉద్యమాలు చేస్తే మనకు తెలంగాణ వచ్చిందని ప్రజలనుద్దేశించి ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. రామగుండం ఎన్టీపీసీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన చాలామంది బీజేపీలో చేరారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇంకో రెండు మూడు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని, బీజేపీ పూర్తిస్థాయిలో ప్రచారాన్ని వచ్చే నెల 3 నుంచి నిర్వహిస్తామన్నారు. జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు ప్రచారానికి వస్తారని కిషన్ రెడ్డి తెలిపారు.
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని బీజేపీ ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. అందుకు బీఆర్‌ఎస్ సహకరిస్తుందన్న ఆయన.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒక్కటేనన్నారు. బీజేపీకి బీఆర్‌ఎస్ ఏ టీం, బీఆర్‌ఎస్‌కు బీజేపీ బీ టీం అంటూ ఆయన విమర్శించారు. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా మెదక్‌లో నిర్వహించిన జనసభలో ఆయన ప్రసంగించారు.
Medigadda Barrage: కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టులో కీలక భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు శిథిలావస్థకు చేరుకోవడం కలకలం రేపింది.
Gutha Sukender Reddy: రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయాలకే కట్టుబడి ఉన్నానని తెలిపారు.
Telangana Govt: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న నోటిఫికేషన్, నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న పోలింగ్.. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
BRS Manifesto Live updates:తెలంగాణ భవన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.