Telangana Govt: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న నోటిఫికేషన్, నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న పోలింగ్.. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కాగా, తెలంగాణ ప్రభుత్వం పోలింగ్ జరిగే నవంబర్ 30వ తేదీని వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించింది. పోలింగ్ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు అధికారికంగా సెలవు ప్రకటించారు. నవంబర్ 29న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన సంస్థలు, కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటించామని.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగే కార్యాలయాలకు సెలవు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలా ఉండగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, నిధులు విడుదల చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు పోలింగ్ నిర్వహణ, ఏర్పాట్లపై ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల నిల్వ కోసం రూ. 19.45 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను వీవీప్యాట్‌లు, ఈవీఎంల నిల్వ కోసం గోదాముల నిర్మాణానికి వినియోగించనున్నారు. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రకటనలు మరియు చెల్లింపు కథనాలను పర్యవేక్షించడానికి రాష్ట్ర స్థాయి మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీని ప్రకటించారు. ఈ కమిటీకి సీఈవో చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
Voter ID : మీ ఓటర్ ఐడి కార్డు పోయిందా? ఇలా చేస్తే క్షణాల్లో కార్డు ను పొందోచ్చు..