తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీఎం పార్టీ మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కోదాడ నియోజకవర్గం నుంచి మట్టిపల్లి సైదులు, మునుగోడు నుంచి దోనూరు నర్సిరెడ్డి, ఇల్లందు నుంచి దుగ్గి కృష్ణలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తారని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక రోజు సీఎం అవుతానని ఆయన అన్నారు. కానీ నాకు సీఎం కావాలని లేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ లోపాన్ని గమనించి హెలికాప్టర్‌ను సురక్షితంగా ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కు చేర్చారు.
CM KCR: సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (సీఎం కేసీఆర్) దర్శించుకున్నారు. వెంకన్న సన్నిధిలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సీపీఎం బాటలోనే సీపీఐ కూడా వెళ్లే అవకాశముంది. ఇవాళ జరగనున్న సీపీఐ రాష్ట్ర కమిటీ సమావేశంలో కాంగ్రెస్‌తో పొత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. సీపీఐకి కొత్తగూడెం సీటు ఆఫర్ చేసింది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్‌ను నమ్మలేమంటున్నారు సీపీఐ నేతలు. మరోవైపు, కాంగ్రెస్‌తో కలిసి సీపీఐ పోటీ చేస్తే.. అక్కడ తమ అభ్యర్థిని పోటీకి పెట్టబోమని సీపీఎం తెలిపింది. అలాగే వామపక్షాలు పోటీ లేని స్థానాల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని ప్రకటించింది సీపీఎం.
Vote: వచ్చే నెలలో తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో పార్టీలన్నీ ప్రచారాలు ఊదరగొడుతున్నాయి. తమకు ఓట్లేస్తే ఇలా చేస్తాం.. అలా చేస్తామంటూ అమలు సాధ్యం అవుతాయా.. లేదా అన్నది ఆలోచించకుండా హామీలు గుప్పిస్తున్నాయి.
సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి సమీక్షించాలని రాహుల్ గాంధీ అన్నారు. జడ్చర్ల కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు ఒకదాని తర్వాత ఒకటి కుంగిపోతున్నాయని రాహుల్ పేర్కొన్నారు.
Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు హాట్ హాట్ గా మారాయి. ఇన్ని రోజులు ఇలాగే ఉంటే.. నిన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (కొత్త ప్రభాకర్ రెడ్డి ఎటాక్)పై కత్తి దాడి మరో స్థాయికి చేరుకుంది.