Balka Suman: ఉస్మానియాలో మేము, ఇక్కడ మీరు ఉద్యమాలు చేస్తే మనకు తెలంగాణ వచ్చిందని ప్రజలనుద్దేశించి ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. రామగుండం ఎన్టీపీసీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏనాడూ న్యాయం చేయలేదని.. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మభ్యపెట్టడానికి వస్తుంది జాగ్రత్త అంటూ ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రకరకాల ముసుగులో, రకరకాల మాటలతో వస్తారు జాగ్రత్త అని బాల్క సుమన్ అన్నారు. చందర్ ఎమ్మెల్యే అయితే ఇక్కడి ప్రాంతాన్ని కేటీఆర్ దత్తత తీసుకొని ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీలు పెరుగుతాయన్నారు.
Also Read: Bandi Sanjay: బీఆర్ఎస్‌ను ఓడించేందుకు ఆ పార్టీ నేతలే కంకణం కట్టుకున్నారు..
చందర్ గట్టోడు కాబట్టే పెద్దపల్లిలో పెట్టాల్సిన మెడికల్ కాలేజీ రామగుండంకు వచ్చిందన్నారు. అభివృద్ధిపై మాట్లాడే దమ్ము లేని వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుతుంటారని ఆయన అన్నారు. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలను చూసి ఓటు వేయాలని, కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికలు అయ్యాక, గెలిచాక మనల్ని పట్టించుకోరని బాల్క సుమన్ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 80 పైచిలుకు స్థానాలు గెలిచి అధికారంలో ఉండబోతుందన్నారు.